కొద్ది నెలలుగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లను పెద్ద ఎత్తున పెంచుతూ.. రూ. రెండు వేలు దాటించిన ఇంధన సంస్థలు కొత్త ఏడాదిలో కాస్త ఊరట కల్పించాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ. 102.5 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ తగ్గింపు వెంటనే అమల్లోకి వస్తున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. గృహ వినియోగ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. గతంలో వాణిజ్య సిలిండర్ ధర కాస్త అందుబాటులో ఉండేది.
Also Read: ఆ డబ్బు మాది కాదు.. అఖిలేశ్ ఎందుకు వణికిపోతున్నారు?: నిర్మలా సీతారామన్
కానీ నెలకు వంద చొప్పున పెంచుతూ వచ్చారు. నవంబర్‌లో ఏకంగా రూ. 260... డిసెంబర్ ఒకటో తేదీన మరో రూ. వంద వడ్డించడంతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రరూ. రెండు వేలు దాటింది. దీంతో రెస్టారంట్లు, హోటళ్లు, టీ స్టాల్ వ్యాపారులపై అదనపు భారం పడింది. వారు కూడా రేట్లు పెంచేయడంతో సామాన్యుడిపై అదనపు భారం పడినట్లయింది. ఈ చార్జీల పెంపునకు ఎప్పుడు అడ్డు కట్ట పడుతుందో తెలియని పరిస్థితి. అయితే కొత్త ఏడాదిలో మాత్రం కాస్త ఊరట ఇవ్వాలని చమురు సంస్థలు భావిస్తున్నాయి. అందుకే కంటి తుడుపుగా అయినా రూ. వంద వరకూ తగ్గించాయి.
Also Read: Kannauj IT Raid: పుష్ప.. పుష్పరాజ్.. ఫ్లవర్ అనుకుంటివా? అత్తరు.. ఈ కథే వేరు!
తాజా తగ్గింపుతో ఢిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. రెండు వేల కంటే తక్కువకు వవస్తుంది. 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.1998.50గా ఉంది. రాష్ట్రాల్లో ఉండే పన్ను విధానాలను బట్టి ఆయా రాష్ట్రాల్లో రేటు కాస్త మారుతుంది. ఇటీవల గృహ వినియోగ సిలిండర్ల రేట్లను కూడా భారీగా పెంచుతూ వచ్చారు. ఇప్పుడు అది దాదాపుగా వెయ్యి రూపాయల దగ్గర ఉంది. ప్రజలకు ఇచ్చే సబ్సిడీలో పూర్తి స్థాయి కోత పడింది.
Also Read: ఎన్నికలకు ముందు ఎక్కడికి పోతావు చిన్నవాడా! రాహుల్ గాంధీ ఫారెన్ ట్రిప్!
రూ. ఇరవై, ముఫ్పై కూడా సబ్సిడీ రావడం లేదు. ఈ క్రమంలో సబ్సిడీ పెంచడమో.. లేకపోతే రేట్లను తగ్గించడమో చేస్తారని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదని తాజాగా కమర్షిలయ్ గ్యాస్ ధరలను కాస్త తగ్గించి... మిగతా వాటి గురించి పట్టించుకోకపోవడంతోనే తేలిపోయిందని భావిస్తున్నారు. దీంతో మధ్యతరగతి ప్రజలకు గ్యాస్ కష్టాలు కొనసాగనున్నాయి.
Also Read: EC Press Conference Highlights: యూపీ ఎన్నికలు యథాతథం.. ఎన్నికల సంఘం కీలక ప్రకటన