ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలపై కీలక ప్రకటన చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఉత్తర్​ప్రదేశ్​లోని రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలు యథాతథంగానే నిర్వహించాలనే తమకు సూచించాయని కేంద్ర ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర తెలిపారు.

ఆ రాష్ట్రంలో మూడురోజుల పర్యటన ముగిసిన తర్వాత విలేకరుల సమావేశం నిర్వహించారు. కొవిడ్ నిబంధనలను అనుసరించి ముందుగా నిర్ణయించిన సమయానికే ఎన్నికలు జరపాలని కోరినట్లు వెల్లడించారు.

స్పీచ్ హైలైట్స్..

  1. ఓటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
  2. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న సిబ్బందినే పోలింగ్ బూత్​లలో వినియోగించనున్నారు.
  3. తుది ఓటరు జాబితా జనవరి 5న విడుదల అవుతుంది.
  4. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, కొవిడ్ బాధితులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
  5. ఓటు వేయడానికి రాలేని వారి ఇంటి వద్దకు అధికారులు వెళ్లనున్నారు.
  6. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్ యంత్రాలు ఏర్పాటు.
  7. పారదర్శకత కోసం లక్ష పోలింగ్ కేంద్రాల నుంచి ఓటింగ్ ప్రక్రియ లైవ్ టెలికాస్ట్.
  8. కొవిడ్ పరిస్థితుల కారణంగా 2022లో జరగనున్న అన్ని రాష్ట్రాల ఎన్నికలకు ఒక గంట పాటు పోలింగ్ సమయం పెంపు.
  9. ఎన్నికలకు ముందే అర్హత ఉన్న వారందరికీ మొదటి డోసు వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తయ్యేలా చూడాలని ఆరోగ్య కార్యదర్శిని కోరిన ఈసీ. 50 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అభ్యర్థన.
  10. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ జోరు పెంచాలని కోరిన ఈసీ.
  11. 800 పోలింగ్ కేంద్రాల్లో కేవలం మహిళా సిబ్బంది మాత్రమే ఉంటారు.
  12. ప్యాన్ కార్డ్, మన్‌రేగా కార్డ్, పోస్ట్ ఆఫీస్ పాస్‌బుక్, ఆధార్ కార్డ్ వంటి 7 డాక్యుమెంట్లను గుర్తింపు కార్డులుగా పరిగణించనున్నారు.

Also Read: Covid 19 Cases in India: దేశంలో భారీగా పెరిగిన కరోనా వ్యాప్తి.. 1000కి చేరువైన ఒమిక్రాన్ కేసులు

Also Read: Gold-Silver Price: పసిడి ప్రియులకు శుభవార్త! పడిపోయిన బంగారం ధర.. వెండి స్థిరంగా.. నేటి రేట్లు ఇవీ..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.