గతేడాది ప్రైమరీ మార్కెట్లో ఐపీవోల సందడి కొనసాగింది. 2021, మార్చి త్రైమాసికం నుంచి కొత్త కంపెనీలు మార్కెట్లో నమోదయ్యాయి. లిక్విడిటీ ఎక్కువగా ఉండటం, లాభాలు రావడంతో ఐపీవోల్లో పెట్టుబడులకు రిటైల్‌ ఇన్వెస్టర్లు మొగ్గు చూపించారు. 2022లోనూ ఇదే ఒరవడి కొనసాగనుంది. ఐపీవో క్రేజ్‌ పెరగనుందని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి.


ఈ ఏడాది ఐపీవోల ద్వారా కంపెనీలు రూ.44,000 కోట్ల వరకు సమీకరించే అవకాశం ఉంది. ఇందులో ఎక్కువగా టెక్నాలజీ ఆధారిత కంపెనీలే ఉన్నాయని మర్చంట్‌ బ్యాంకర్స్‌ అంటున్నారు. 2021లో 63 కంపెనీలు రూ.1.2 లక్షల కోట్లు ఐపీవోల ద్వారా సేకరించడం గమనార్హం. ఇవే కాకుండా పవర్‌ గ్రిడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ రూ.7,735 కోట్లు, బ్రూక్‌ఫీల్డ్‌ ఇండియా రియల్‌ ఎస్టేట్‌ ట్రస్ట్‌ రూ.3,800 కోట్లు సేకరించాయి.


ఈ ఏడాది హోటల్‌ అగ్రిగేటర్‌ ఓయో (రూ.8,430 కోట్లు), సప్లై చైన్‌ కంపెనీ డెల్హీవరీ (రూ.7,460 కోట్లు) ఐపీవోకు రానున్నాయి. వీటితో పాటు అదానీ విల్‌మర్‌ (రూ.4500 కోట్లు), ఆమ్‌క్యూర్‌ ఫార్మాసూటికల్స్‌ (రూ.4,000 కోట్లు), వేదాంత్‌ ఫ్యాషన్స్‌ (రూ.2,500 కోట్లు), పారాదీప్‌ ఫాస్పేట్స్‌ (రూ.2200 కోట్లు), మెదాంత (రూ.2000 కోట్లు), ఇక్సిగో (రూ.1800 కోట్లు) లిస్ట్‌ అవుతాయి. స్కాన్‌రే టెక్నాలజీస్‌, హెల్తియమ్‌ మెడ్‌టెక్‌, సహజానంద్‌ మెడికల్‌ టెక్నాలజీస్‌ వస్తాయని తెలిసింది. అన్నీ కుదిరితే ఎల్‌ఐసీ మెగా ఐపీవో కూడా ఉండనుంది.


Also Read: New Year New GST: "హ్యాపీ న్యూ ఇయర్" చెప్పుకున్నంత ఈజీ కాదు.. చాలా భారమే ! మీపై ఎంత భారం పడబోతోందో చూడండి.. !


Also Read: Commercial LPG Price : పెంచుతూ పోయి... చివరికి కాస్త తగ్గించారు !వాణిజ్య సిలిండర్ ధరను రూ. వంద తగ్గించిన కంపెనీలు !


Also Read: Liquor Sales: తెలంగాణలో కిక్ ఎక్కించిన మద్యం అమ్మకాలు.. ఈ 5 రోజుల్లో మందుబాబులు అన్ని కోట్లు తాగేశారా..!


Also Read: Year End 2021: 2021లో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన టాప్-10 ఎస్‌యూవీ కార్లు ఇవే..


Also Read: Dual Mode Vehicle: ఇది బస్సే కాదు రైలు కూడా.. ఐడియా సూపర్ ఉంది కదా!


Also Read: Alto 2022: త్వరలో ఆల్టో కొత్త మోడల్ కూడా... బడ్జెట్‌లో సూపర్ కారు!