కరోనా వచ్చాక పసుపు వినియోగం పెరిగింది. వంటల్లో దానికిచ్చే ప్రాధాన్యత కూడా ఎక్కువైంది. కాకపోతే కొందరికి తెలియక మీర అతిగా వినియోగించేస్తారు. ఏదైనా అతి చేస్తే అనర్థమే. అలాగే పసుపు కూడా అధిక వినియోగం వల్ల శరీరంలో ఐరన్ లోపం ఏర్పడే అవకాశం ఉంది. పసుపులో యాంటీ ఇన్ఫ్లమ్మేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కరోనా వేవ్ సమయంలో రోగినిరోధక శక్తిని పెంచుకునేందుకు పసుపు వాడకాన్ని ప్రజలు పెంచారు. నిజమే పసుపు వల్ల చాలా లాభాలు ఉన్నాయి. శరీరంలోని వాపును, మంటలను తగ్గిస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. కానీ అది సరైన మోతాదులో తీసుకున్నాప్పుడు. మోతాదు మించితే నష్టం తప్పదు. 


ఐరన్ లోపం వచ్చేలా...
పసుపు అధికంగా తీసుకునే వారిలో ఐరన్ లోపం కనిపిస్తుంది. ఇది శరీరం ఇనుమును శోషించుకునే గుణాన్ని తగ్గిస్తుంది. హిమోగ్లోబిన్ ను ఉత్పత్తి చేయడానికి మన శరీరానికి అవసరమయ్యే అత్యవసర ఖనిజం హిమోగ్లోబిన్. ఇది రక్తంలో ఆక్సిజన్ ను రవాణా చేసేందుకు అవసరమయ్యే ప్రోటీన్. అయితే పసుపు అధికంగా తినడం వల్ల ఇనుము శోషణ 20 శాతం నుంచి 90 శాతానికి పడిపోతుంది. ఇది పసుపులో ఉండే స్టోయికియోమెట్రిక్ లక్షణాల వల్ల జరుగుతుంది. ఈ లక్షణం వల్లే ఇనుమును శరీరంలో శోషించలేదు. పసుపులో కీలకమైన పదార్థం కుర్కుమిన్. ఇది ఫెర్రిక్ కర్కుమిన్ సమ్మేళనాన్ని తయారుచేయడానికి ఇనుమును బంధిస్తుంది. 


పసుపు మితంగా తీసుకుంటే అది అన్నివిధాలుగా మీకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. అంటే వంటల్లో వేసుకుని తిన్నంత వరక ఓకే, కానీ కొందరు కర్కుమిన్ సప్లిమెంట్లు తీసుకుంటారు. వీటి వల్లే సమస్య మొదలవుతుంది. కాబట్టి పసుపులో ఉండే గుణాల కోసం సప్లిమెంట్లు, ఇంజెక్షన్లను ప్రయత్నించకండి. 


పసుపు అధికంగా ఒంట్లో చేరడం వల్ల కేవలం ఇనుము లోపించడమే కాదు, జీర్ణ సమస్యలు, తలనొప్పి, చర్మంపై దద్దుర్లు కూడా వస్తాయి. అలాగే కాలేయం పరిమాణం పెరగడం, పొట్టలో పుండ్లు ఏర్పడడం, వాపులు వంటివి కలుగుతాయి. పేగు, లేదా కాలేయ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది. 


Also read: మీ పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ వేయిస్తున్నారా... తల్లిదండ్రులుగా మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి


Also read: సజ్జ రొట్టె లేెదా జొన్న రొట్టె... ఈ రెండింటిలో బరువు తగ్గేందుకు ఏది తింటే బెటర్?



Also read: ఆవలింతలు వస్తున్నాయా... అయితే మెదడు మీకేదో చెప్పాలనుకుంటోంది


Also read: అతిగా నీళ్లు తాగితే ఎంత ప్రమాదమో తెలుసా?


Also read: సిపాయిల తిరుగుబాటులో ప్రాణాలు కోల్పోయిన ఓ బ్రిటిష్ ఆఫీసర్... అతని ఆత్మ ఇంకా అక్కడే ఉందుంటున్న స్థానికులు













ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.