శాంసంగ్ గెలాక్సీ ఏ03 స్మార్ట్ ఫోన్ ధరను కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ గతేడాది నవంబర్‌లో లాంచ్ అయింది. అయితే అప్పుడు కంపెనీ ధరను ప్రకటించలేదు. ఇందులో రెండు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వియత్నాంలో దీనికి సంబంధించిన సేల్ జనవరి 10వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ03 ధర
ఇందులో 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను వియత్నాంలో 2,990,000 డాంగ్‌లుగా (సుమారు రూ.9,700) నిర్ణయించారు. ఇక 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,490,000 డాంగ్‌లుగా (సుమారు రూ.11,300) ఉంది. బ్లాక్, బ్లూ, రెడ్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు. అయితే ఏ-సిరీస్ ఫోన్లు మనదేశంలో సూపర్ హిట్ కాబట్టి ఈ ఫోన్ కూడా త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ03 స్పెసిఫికేషన్లు
ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఇన్‌ఫినిటీ-వి డిస్‌ప్లేని శాంసంగ్ అందించింది. ఆక్టాకోర్ యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 4 జీబీ వరకు ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. వెనకవైపు రెండు కెమెరాలను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్‌గా ఉండగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. డాల్బీ అట్మాస్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. వాటర్ డ్రాప్ నాచ్‌లో సెల్ఫీ కెమెరాను అందించారు. వాల్యూమ్ రాకర్లను ఫోన్ ఎడమవైపు అందించారు. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉందో లేదో తెలియరాలేదు.
Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!
Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!
Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!