మోటో ఎడ్జ్ ఎక్స్30 స్మార్ట్ ఫోన్ మనదేశంలో జనవరి చివర్లో లేదా ఫిబ్రవరి చివర్లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఫోన్ ఇటీవలే చైనాలో లాంచ్ అయింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఇందులో 144 హెర్ట్జ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 68W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది.


91మొబైల్స్ కథనం ప్రకారం.. ఈ ఫోన్ జనవరి, ఫిబ్రవరిల్లోనే లాంచ్ కానుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌ను అందించారు. కాబట్టి అత్యంత పవర్‌ఫుల్ ఫోన్లలో ఒకటి అయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు షియోమీ 12 సిరీస్, రియల్‌మీ జీటీ 2 ప్రో మాత్రమే ఈ ప్రాసెసర్‌తో లాంచ్ అయ్యాయి. అయితే ఇవి మనదేశంలో ఇంకా లాంచ్ కాలేదు. కాబట్టి మనదేశంలో ఈ ప్రాసెసర్‌తో లాంచ్ అయ్యే మొదటి ఫోన్ మోటో ఎడ్జ్ ఎక్స్30 అయ్యే అవకాశం ఉంది. మోటొరోలా ఎడ్జ్ ఎక్స్30 ఇటీవలే చైనాలో లాంచ్ అయింది కాబట్టి ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల విషయంలో ఎలాంటి సస్పెన్స్ లేదు.


మోటో ఎడ్జ్ ఎక్స్30 స్పెసిఫికేషన్లు
ఇందులో 6.8 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కంపెనీ అందించింది. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉండగా, 144 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, హెచ్‌డీఆర్10+ సపోర్ట్ కూడా ఇందులో ఉన్నాయి. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌ను ఇందులో అందించారు.


12 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉంది. 256 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై మోటో ఎడ్జ్ ఎక్స్30 పనిచేయనుంది. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 68W టర్బోపవర్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 


ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు ఏకంగా 60 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు.


యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా ఇందులో అందించారు. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. దీని మందం 0.85 సెంటీమీటర్లు కాగా, బరువు 194 గ్రాములుగా ఉంది.


Also Read: Asus Rog Phone 5 Ultimate: 18 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్.. ల్యాప్‌టాప్ కాదు స్మార్ట్‌ఫోనే.. సేల్ ఎప్పుడంటే?


Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!


Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!


Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!


Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?


Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?






ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి