టెక్నో కామోన్ 18 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. బడ్జెట్ ధరలోనే ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. ఇందులో వెనకవైపు 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. 6.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ భారీ డిస్‌ప్లే ఇందులో ఉంది. 4 జీబీ ర్యామ్ ఇందులో ఉంది. దీన్ని 7 జీబీ వరకు పెంచుకోవచ్చు.


టెక్నో కామోన్ 18 ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.14,999గా అందించారు. ఈ ఫోన్ కొంటే బడ్స్ 2 ట్రూ వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌ను ఉచితంగా అందించనున్నారు. డస్క్ గ్రే, ఐరిస్ పర్పుల్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. డిసెంబర్ 27వ తేదీన దీని సేల్ జరగనుంది.


టెక్నో కామోన్ 18 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత హైఓఎస్ 8 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో అందించారు. ఇందులో ర్యామ్‌ను 7 జీబీ వరకు పెంచుకునే ఆప్షన్ కూడా ఉంది.


మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ లెన్స్, ఏఐ లెన్స్ కూడా ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 48 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.


దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఈ ఫోన్ కెమెరాలో స్లో మోషన్, నైట్ వీడియో మోడ్, వీడియో బొకే, ఇతర మోడ్స్ కూడా ఉన్నాయి.


Also Read: Asus Rog Phone 5 Ultimate: 18 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్.. ల్యాప్‌టాప్ కాదు స్మార్ట్‌ఫోనే.. సేల్ ఎప్పుడంటే?


Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!


Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!


Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?


Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?


Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి