Omicron Latest News: మీరు విమానాల్లో ప్రయాణిస్తుంటారా? జాగ్రత్త..! అధికంగా వైరస్ సంక్రమణ.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..

ఒక్క అమెరికాలో కొత్తగా నమోదవుతున్న కేసుల్లోనే దాదాపు 70 శాతం కేసులు ఈ కొత్త వేరియంట్‌వే కావడం.. ఈ స్ట్రెయిన్ ఎంత వేగంగా వ్యాప్తి చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.

Continues below advertisement

ప్రపంచవ్యాప్తంగా ఓమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్న వేళ విమాన ప్రయాణాలు చేస్తున్నవారికి హెచ్చరిక. విమానం ఎక్కి ప్రయాణాలు చేసేవారికి ఓమిక్రాన్ వేరియంట్ సంక్రమించే అవకాశం రెట్టింపు లేదా మూడు రెట్లు అధికంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) సంస్థకు మెడికల్ అడ్వైజర్‌గా ఉన్న డాక్టర్ డేవిడ్ పోవెల్ వెల్లడించారు. ఈ ఐఏటీఏ అనేది ప్రపంచవ్యాప్తంగా 300 విమాన సంస్థలకు ప్రాతినిథ్యం వహిస్తోంది. అయితే, ఒక్క అమెరికాలో కొత్తగా నమోదవుతున్న కేసుల్లోనే దాదాపు 70 శాతం కేసులు ఈ కొత్త వేరియంట్‌వే కావడం.. ఈ స్ట్రెయిన్ ఎంత వేగంగా వ్యాప్తి చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇంత ప్రభావవంతంగా ఉన్న వైరస్ విమానాల్లో ప్రయాణించిన వారికి సంక్రమించే అవకాశం అధికంగా ఉంటుందని తాజాగా వెల్లడైంది. 

Continues below advertisement

Also Read: Omicron Death In US: అమెరికాలో ఒమిక్రాన్‌‌తో తొలి మరణం నమోదు.. యూఎస్‌లో మొదలైన కలవరం

విమానాల్లో ఇలా సంక్రమించే ఛాన్స్
పెద్ద పెద్ద ఆస్పత్రుల్లో ఉండే ఎయిర్ ఫిల్టర్స్ ప్రయాణికుల విమానాల్లో ఉంచినప్పటికీ వైరస్ సంక్రమణ ముప్పు పొంచే ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఎకానమీ సెక్షన్‌తో పోలిస్తే బిజినెస్ క్లాస్ కాస్త సేఫ్ అని డేవిడ్ పోవెల్ బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థతో అన్నారు. డెల్టా వేరియంట్ వల్ల ఎలాంటి సంక్రమణ ముప్పు ఎదురైందో దానికి మించి రెండు లేదా మూడు రెట్లు అధికంగా ఉండే అవకాశం ఉందని పోవెల్ వెల్లడించారు. 

Also Read: Fisherman: అదృష్టమంటే నీదేనయ్యా.. సముద్రంలో చేపలకు గాలం వేస్తే నిధే దొరికినట్టు ఉందిగా!

అయితే, విమానాల్లో వైరస్ సంక్రమణ ముప్పును ఎలా తప్పించుకోవచ్చో కూడా డేవిడ్ పోవెల్ వివరించారు. విమానం వద్దకు వెళ్లిన సమయం నుంచి లోపలి భాగాలను వీలైనంత వరకూ ముట్టుకోకుండా ఉండాలని సూచించారు. చేతులను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవడం సహా ఇతరులతో దగ్గర్నుంచి ఫేస్ టూ ఫేస్ మాట్లాడడం, భౌతిక దూరం పాటించడం, తినేటప్పుడు మినహా మాస్కు తీయకుండా ఉండడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని పోవెల్ సూచించారు. వ్యాక్సిన్ వేసుకొని ఉండడం, పటిష్ఠమైన మాస్కు ధరించడం వంటివి చేయొచ్చని చెప్పారు. అత్యవసరం అయితే తప్ప వీలైనంత వరకూ విమాన ప్రయాణం జోలికి ఈ సమయంలో పోవద్దని సూచించారు.

Also Read: ఒమిక్రాన్ వెంటే పొంచి ఉన్న మరో వేరియంట్, ఆ రెండూ కలిసిపోయి కొత్తగా.. దీని తీవ్రత ఎంతంటే..!

Also Read: Divorce: దుబాయ్ రాజు విడాకులు.. భార్యకు భరణం ఎన్ని కోట్లు చెల్లించాలో తెలుసా

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement