అసుస్ రోగ్ ఫోన్ 5 స్మార్ట్ ఫోన్ మనదేశంలో మార్చిలో లాంచ్ అయింది. అయితే ఇందులో 18 జీబీ ర్యామ్ వేరియంట్ అయిన అసుస్ రోగ్ ఫోన్ 5 అల్టిమేట్ డిసెంబర్ 26వ తేదీన మొదటిసారి సేల్‌కు వెళ్లనుంది. అసుస్ రోగ్ ఫోన్ 5 అల్టిమేట్‌లో 18 జీబీ ర్యామ్ అందించారు. దీంతోపాటు 512 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. ఇందులో 6.78 అంగుళాల శాంసంగ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్‌గా ఉంది.


అసుస్ రోగ్ ఫోన్ 5 అల్టిమేట్ ధర
దీని ధరను రూ.79,999గా నిర్ణయించారు. దీనికి సంబంధించిన సేల్ డిసెంబర్ 26వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉండనుంది. స్టార్మ్ వైట్ కలర్ ఆప్షన్‌లో ఇది అందుబాటులో ఉండనుంది.


అసుస్ రోగ్ ఫోన్ 5 అల్టిమేట్ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత రోగ్ యూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ శాంసంగ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20.4:9గా ఉంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 300 హెర్ట్జ్‌గానూ ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది.


18 జీబీ ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఇందులో ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్‌గా ఉంది. 30W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 1.03 సెంటీమీటర్లుగానూ, మందం 238 గ్రాములుగానూ ఉంది.


ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్686 సెన్సార్ కాగా, దీంతోపాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 24 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.


5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, వైఫై డైరెక్ట్, బ్లూటూత్ వీ5.2, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి. జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, బైదు, క్యూజెడ్ఎస్ఎస్, నావిక్, యాక్సెలరేటర్, ఈ-కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, గైరోస్కోప్, అల్ట్రా సోనిక్ సెన్సార్లు కూడా ఉన్నాయి. 


Also Read: Jio 1 Rs Recharge Plan: రూ.1కే జియో రీచార్జ్ ప్లాన్.. లాభాలు ఏంటంటే?


Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!


Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!


Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?


Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?


Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి