వివాహం అవ్వాలని, తల్లి కావాలని కోరుకోని మహిళలు ఎవరుంటారు? కానీ చాలా మందికి పునరుత్పత్తి సమస్యలు ఎదురవుతున్నాయి. ఆధునిక కాలంలో వారు తీసుకునే ఆహారం కూడా వారిలో ఇన్‌ఫెర్టిలిటీని పెంచుతోంది. ఇది కేవలం ఆడవాళ్లకే కాదు, మగవారికీ చెందుతుంది. వారిలోని వీర్యకణాలు ఆరోగ్యకరంగా, చురుగ్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఆడ, మగ పునరుత్పత్తి వ్యవస్థలను కాపాడుకోవాలంటే... తాజా పోషకాహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. హార్వర్డ్ మెడికల్ స్కూల్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం కొన్ని ఆహారాలను తినడం వల్ల గర్భధారణ అవకాశాలు పెరుగుతాయని తేలింది. 


ఆకుకూరలు...
గర్భం ధరించాక, ధరించడానికి సిద్ధమవుతున్నప్పుడు కూడా ఫోలేట్ విటమిన్ చాలా అవసరం. ఇది న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారిస్తుంది. గర్భం దాల్చడానికి ముందు నుంచి ఫోలేట్‌ను తీసుకోవడం ప్రారంభించాలి. వైద్యుడిని సంప్రదిస్తే సప్లిమెంట్లు రాసిస్తారు. ఆహారం ద్వారా వీటిని పొందాలనుకుంటే కాలే, పాలకూర వంటి ఆకుకూరలు తినాలి. ఇందులో ఫొలేట్ తో పాటూ, ఇనుము, విటమిన్ కె వంటి ప్రీనాటల్ పోషకాలు అధికంగా లభిస్తాయి. ఇవి పుట్టుకతో వచ్చే లోపాల నుంచి బిడ్డను కాపాడతాయి. ఆకుకూరల్లో విటమిన్ బి ఉంటుంది. ఇవి స్త్రీలలోని అండం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 


దానిమ్మ పండులో విటమిన్ సి, కె, ఫోలేట్, ఇతర ఖనిజాలు ఉంటాయి. ఈ పండులో సంతానోత్పత్తికి సహాయపడే అనేర రకాల పోషకాలు ఉంటాయి. దానిమ్మతో పాటూ నారింజ, కివీ, ఉసిరి, స్ట్రాబెర్రీ వంటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి ప్రొజెస్టరాన్ అనే గర్భధారణ హార్మోన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. అలాగే వీర్యకణాల ఆరోగ్యాన్ని, కదలికలను కూడా మెరుగుపరుస్తుంది. కాబట్టి విటమిన్ సి ఉండే ఆహారాన్ని పిల్లల్ని కనాలనుకుంటున్న భార్యభర్తలు తినాలి. 


విటమిన్ డి కూడా గర్భధారణకు చాలా ముఖ్యం. సూర్యకాంతితో పాటూ గుడ్లు, సాల్మన్ చేపలు, చేప నూనెల్లో ఈ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. అల్పాహారంలో గుడ్డును తింతే కోలిన్ లభిస్తుంది. ఇది పిండం ఎదుగుదలపై మంచి ప్రభావం చూపిస్తుంది. విటమిన్ డి స్పెర్మ్ నాణ్యతను కూడా పెంచుతుంది. 


సీఫుడ్, సాల్మన్ చేపలు, మాంసం, పాల ఉత్పత్తులు, గుడ్లు వంటి వాటిలో విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తుంది. ఈ విటమిన్ ఆరోగ్యకరమైన అండాన్ని అభివృద్ధి చేస్తుంది. 


ఒమెగా ఆమ్లాల కోసం...
ఒమెగా3, ఒమెగా6 ఫ్యాటీ ఆమ్లాలు హార్మోన్ల సమతుల్యతకు చాలా అవసరం. అవిసెగింజల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి. అవిసె గింజలను ఏదో ఒకరూపంలో రోజూ తీసుకుంటే చాలా మంచిది. 


గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.


Also read: వార్నీ... ఈ యూనివర్సిటీలో తినడం, తాగడం నేర్పిస్తారట, చివరికి అది కూడా...


Also read: అంధుల పాలిట వరం బ్రెయిలీ లిపి... అసలు ఎవరీ బ్రెయిలీ? అతనెందుకు ఈ లిపిని కనిపెట్టారు?


Also read: దేశీ వైన్... చలికాలంలో తాగితే శరీరానికి వెచ్చదనం, ఆరోగ్యం కూడా


Also read: పసుపు అధికంగా తింటే శరీరంలో ఐరన్ లోపించే అవకాశం... ఇంకా ఎన్నో సమస్యలు


Also read: మీ పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ వేయిస్తున్నారా... తల్లిదండ్రులుగా మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి


Also read: సజ్జ రొట్టె లేెదా జొన్న రొట్టె... ఈ రెండింటిలో బరువు తగ్గేందుకు ఏది తింటే బెటర్?














ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.