కొందరు కేవలం ఆకలి తీర్చుకోవడం కోసం మాత్రమే ఆహారానికి ప్రాధాన్యతనిస్తారు. అంతకుమించి వారి దృష్టిలో ఆహారం అంటే నథింగ్. కానీ ఆహారప్రియుల ఆలోచనలన్నీ తినడం, వండడం, తాగడం చుట్టే తిరుగుతుంది. వారి జీవితం వీటిపైనే ఆధారపడి ఉంటుంది. ఇలాంటి వారి కోసమే ఓ మాస్టర్ కోర్సు సిద్ధమైంది. ఫ్రాన్స్‌లోని ప్రముఖ పొలిటికల్ సైన్స్ పాఠశాలల్లో ఒకటి ‘సైన్సెస్ పో లిల్లే’. ఇందులోనే తాగడం, తినడంతో పాటూ చివరికి ఆహారంతో కలిసి జీవించడమెలాగో కూడా నేర్పిస్తారట. ఈ కోర్సు నేర్చుకోవడానికి కావాల్సిందల్లా ఆహారం అంటే ఆసక్తి, దానిపైనే కెరియర్ ను నిర్మించుకోవాలనే ఆలోచన ఉండాలి.
ఈ కోర్సును అక్కడ ‘బీఎమ్‌వి’ అని పిలుస్తారు. అంటే ‘బోయిర్, మ్యాంగర్, వివ్రే’ అని అర్థం. వీటిని తెలుగులో చెప్పాలంటే ‘ఆమారం, పానీయం, జీవనం’. ఈ కోర్సులో కలర్ చేసే అంశాలు చాలా సాధారణంగా ఉండవు. ఫుడ్ టెక్, గ్యాస్ట్రో డిప్లమసీ వంటి అంశాలతో పాటూ వంటగదిలో సెక్సిజాన్ని ఎలా ఎదుర్కోవాలని అనే విషయాలను కూడా నేర్పుతారు. వ్యవసాయం చరిత్ర, మాంసానికి ప్రత్యామ్నాయాలు, మొక్కల ఆధారిత ఆహారాలు... ఇలా చాలా రకాల విషయాల గురించి వ్యాపాలు రాయించడం, చర్చలు జరుగుతాయి. ఆహారనేపథ్యంలో జరిగే సమావేశాలకు కూడా విద్యార్థులు హాజరవుతుంటారు.
అలాగే విద్యార్థులు ఆహార నాణ్యత, పని గురించి చర్చించుకోవడానికి విద్యార్థుల్లో కొందరు జర్నలిస్టులుగా, కొందరు ఫుడ్ డెలివరీ సంస్థ ఉన్నతాధికారులుగా, ఆహార సమీక్షకులుగా మారతారు. వీరి మధ్య డిబేట్లు జరుగుతాయి.
ఇప్పటికే 15 మంది విద్యార్థులతో కూడిన మొదటి బ్యాచ్ తమ చదువును పూర్తి చేసుకుంటోంది. వీరు తమ భవిష్యత్తును ఆహార ఆధారంగానే నిర్మించుకోబోతోంది.
Also read: అంధుల పాలిట వరం బ్రెయిలీ లిపి... అసలు ఎవరీ బ్రెయిలీ? అతనెందుకు ఈ లిపిని కనిపెట్టారు?
Also read: దేశీ వైన్... చలికాలంలో తాగితే శరీరానికి వెచ్చదనం, ఆరోగ్యం కూడా
Also read: పసుపు అధికంగా తింటే శరీరంలో ఐరన్ లోపించే అవకాశం... ఇంకా ఎన్నో సమస్యలు
Also read: మీ పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ వేయిస్తున్నారా... తల్లిదండ్రులుగా మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి
Also read: సజ్జ రొట్టె లేెదా జొన్న రొట్టె... ఈ రెండింటిలో బరువు తగ్గేందుకు ఏది తింటే బెటర్?
Also read: అతిగా నీళ్లు తాగితే ఎంత ప్రమాదమో తెలుసా?