2022 జనవరి 6 గురువారం రాశిఫలాలు
మేషం
మీరు ఎప్పటి నుంచో అనుకున్న ఓ కోర్కె నెరవేరుతుంది. ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి. కెరీర్లో ముందుకు సాగే అవకాశాలున్నాయి. ఇంటి సభ్యుల మధ్య సఖ్యత చాలా బావుంటుంది. వ్యాపారంలో పురోగతి వల్ల ఉత్సాహంగా ఉంటారు. మీ పని మీరు నిర్వర్తించేందుకు మొహమాట పడొద్దు.
వృషభం
సహోద్యోగులు మీతో చాలా సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. గృహానికి సంబంధించిన వివాదాలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, ఈ రోజు మంచి రోజు. ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందొచ్చు.
మిథునం
తొందరపాటు కారణంగా మీ పనికి భంగం కలుగుతుంది. విద్యార్థులు చదువులో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. సంఘంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. న్యాయపరమైన విషయాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయి. వ్యాపార కోసం ప్రయాణం చేయాల్సి రావొచ్చు.
Also Read: శని ప్రభావంతో బాధపడుతున్నారా.. అయితే మంగళవారం,శనివారం ఇలా చేయండి..
కర్కాటకం
వ్యాపారంలో నష్టం వచ్చే సూచనలున్నాయి జాగ్రత్త. కొత్త ఉద్యోగం ప్రారంభించడం కష్టమవుతుంది. గృహానికి సంబంధించి వివాదాలు ఉండొచ్చు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. అనవసర విషయాలపై అభిప్రాయాలు చెప్పడం మానుకోండి. ప్రభుత్వ పనుల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది.
సింహం
అవివాహితులకు మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. మీరు ఎవరినైనా ప్రేమిస్తే, వారితో మీ మనసులో మాట చెప్పడానికి ఈ రోజు శుభప్రదం. వ్యాపారంలో మీ ఆదాయం పెరుగుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులకు ఆటంకాలు తొలగిపోతాయి. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది.
Also Read: ఏ నక్షత్రం వారికి ఏ అక్షరంతో పేరు పెట్టాలంటే..
కన్య
ఈ రోజు మీరు ఆర్థికపరంగా కొంత ఇబ్బంది ఎదుర్కొంటారు. స్నేహితుల సహాయం తీసుకోవలసి రావొచ్చు. ఉన్నతాధికారులు మీ పనితీరుపై అసంతృప్తిగా ఉంటారు. ప్రత్యర్థులు మీకు హాని కలిగించడానికి ప్రయత్నించవచ్చు
తుల
ఈ రోజు ఓ పెద్ద బాధ్యతను నెరవేర్చడానికి ప్రయత్నించండి. మీపని మీరే చేసుకోండి. కుటుంబ సభ్యులపై అనవసరంగా కోపం తెచ్చుకోవద్దు. కొన్ని పనులకు ప్రణాళికలు వేస్తారు. చెడు అలవాట్లను వదులుకోండి.
వృశ్చికం
ఆహారం విషయంలో నిర్లక్ష్యం మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో సమయం గడపండి. మీ పనిని ఇతరులకు అప్పగించవద్దు. మీరు గతంలో చేసిన తప్పులకు పశ్చాత్తాపపడతారు.
ధనస్సు
మీరు తలపెట్టిన పనుల్లో కుటుంబం, స్నేహితుల మద్దతు మీకు ఉత్సాహాన్నిస్తుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు శుభసమయం. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి.
Also Read: భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఈ పనులు చేయకూడదంటారు …ఎందుకో తెలుసా..
మకరం
పెట్టుబడులు పెట్టేటప్పుడు తెలివిగా వ్యవహరించండి. న్యాయపరమైన విషయాల్లో మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కొత్తగా చేపట్టే పనుల పట్ల భయపడతారు. స్నేహితులు, శ్రేయోభిలాషుల నుంచి అభిప్రాయాలు సేకరించడం మరిచిపోవద్దు.
కుంభం
పై అధికారులు మీపని తీరుపట్ల సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కుటుంబ సభ్యులకు బహుమతులు ఇవ్వాలనే ఆలోచన ఉంటుంది. స్నేహితులను కలుస్తారు. ఎప్పటి నుంచో చేతికందాల్సిన మొత్తం రావొచ్చు. ఉద్యోగులు శుభవార్త వింటారు.
మీనం
ఈరోజు మీ ప్రణాళికలు ముందుకు సాగవు. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. అవసరం లేకుండా బయటకు వెళ్లాలనే ఆలోచన విరమించుకోండి. కుటుంబ సభ్యులపై కోపం ప్రదర్శించవద్దు. మిమ్మల్ని ఇతరులతో పోల్చుకుని మీ విలువ తగ్గించుకోవద్దు. వృద్ధుల ఆరోగ్యం బాగుంటుంది.
Also Read: ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి..
Also Read: ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకంటారా.. అయితే మీకు ఈ విషయం తెలియదేమో..
Also Read: 11 ఇంద్రియాలపై నియంత్రణే వైకుంఠ ఏకాదశి దీక్షలో ఆంతర్యం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి