దేశంలో రెండో ఒమిక్రాన్ డెత్ నమోదైంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ నగరంలో ఓ వ్యక్తి ఒమిక్రాన్‌తో చనిపోయినట్టు అధికారులు ధ్రువీకరించారు. గతం వారం ఆయన మరణించాడు. ఆయన ఒమిక్రాన్‌తో తుదిశ్వాస విడిచాడని టెస్టుల్లో తేలింది. ఇటీవలే మహారాష్ట్రలో ఓ వ్యక్తి ఒమిక్రాన్‌తో మరణించాడు. అయితే అది కరోనా మాత్రమే అని అప్పట్లో అధికారులు చెప్పారు. అందుకే రాజస్థాన్‌లోని రిజిస్టర్ అయిన డెత్ కేసే తొలి మరణమని చెప్తున్నారు.
ఉదయ్‌పూర్‌లో వ్యక్తి ఒమిక్రాన్‌తోనే చనిపోయినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ విలేకర్ల సమావేశంలో తెలియజేశారు.
జ్వరం, దగ్గు వంటి లక్షణాలతో ఉదయ్‌పూర్‌లోని ఓ ఆసుపత్రిలో 73ఏళ్ల వ్యక్తి చేరాడు. డిసెంబర్ 15న ఆసుపత్రిలో చేరిన ఆయనకు డిసెంబర్31వరకు చికిత్స చేశారు. రెండుసార్లు చేసిన పరీక్షల్లో మాత్రం ఆయనకు నెగిటివ్ వచ్చింది. కానీ చనిపోయిన తర్వాత చేసిన పరీక్షల్లో ఒమిక్రాన్ ఉన్నట్టు తేలింది. డిసెంబరు 25 జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిన నమూనా ఫలితాల్లో ఆయనకు ఒమిక్రాన్ ఉన్నట్టు ధ్రువీకరించారు.
డయాబెటిస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్, కరోనా తర్వాత వచ్చిన వ్యాధుల కారణంగా ఆయన మరణించాడని ఉదయపూర్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ దినేష్ ఖరాడి చెప్పారు.
ఆయనకు రెండుడోస్‌ల టీకా కూడా వేయించకున్నాడని ఉదయ్‌పూర్‌లోని మహారాణా భూపాల్ ప్రభుత్వ ఆసుపత్రి (MBGH) సూపరింటెండెంట్ డాక్టర్ R.L.సుమన్ తెలిపారు. ఆయన ఆసుపత్రిలో చేరినప్పుడు శ్వాసకోశ సమస్యలు, న్యుమోనియా లక్షణాలు ఉన్నాయని చెప్పారు.
“ఒమిక్రాన్‌తో చనిపోయిన వ్యక్తి కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నాడు. అతనికి కొవిడ్-19 సోకడం ఇదే తొలిసారి. అతనికి రెండుసార్లు నెగిటివ్ రావడంతో సాధారణ వార్డుకు మార్చాం, అక్కడ అతనికి బిపాప్ మాస్క్ ఇచ్చామన్నారు డాక్టర్ సుమన్
మరోవైపు దిల్లీ ఒకే రోజు పదివేలకుపైగా కేసులు రిజిస్టర్ అయ్యాయి. దిల్లీలో 10,665 కేసులు నమోదయ్యాయి. ఇది మే 12 నుంచి నమోదైన కేసుల్లో అత్యధికం. మంగళవారంతో పోల్చుకుంటే దిల్లీలో కేసులు దాదాపు రెట్టింపు అయ్యాయి. పాజిటివిటీ రేటు 11.88శాతానికి పెరిగింది.
కేసుల పెరుగుదలను అరికట్టడానికి దిల్లీ ప్రభుత్వం వారాంతపు కర్ఫ్యూను ప్రకటించింది. దేశ రాజధానిలో థర్డ్ వేవ్ స్టార్ట్ అయిందని ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ చెప్పారు. కోవిడ్ రోగుల కోసం 40 శాతం బెడ్స్ రిజర్వ్ చేయాలని దిల్లీ ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులను ఆదేశించింది.
ముంబైలో బుధవారం రోజువారీ కోవిడ్ -19 కేసులు 39 శాతం పెరిగాయి, 24 గంటల్లో 15,166 కొత్త కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసులు 20వేల మార్క్ దాటితే లాక్డౌన్ విధిస్తామన్నారు ముంబై మేయర్ కిషోరి పెడ్నేకర్.
Also Read: PM Narendra Modi: పంజాబ్‌లో ప్రధాని మోదీకి నిరసన సెగ.. ర్యాలీ రద్దు చేసి హుటాహుటిన దిల్లీకి పయనం!
Also Read: Covid-19 Update: ఒక్కరోజే 58 వేల కరోనా కేసులు.. దేశంలో వైరస్ 'మహా' కల్లోలం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మహారాష్ట్రలో బుధవారం 26,538 కొత్త కోవిడ్ -19 కేసులు రిజిస్టర్ అయితే ఎనిమిది మంది మరణించారు. 5,331 మంది డిశ్చార్జ్ అయినప్పటికీ యాక్టివ్ కేసులు 87,505కి పెరిగాయి.