కరోనా కొత్త వేరియంట్, తాజా పరిస్థితులు మరిన్ని ప్రమాదకర కొత్త వేరియంట్లు పుట్టుకు రావడానికి కారణం అవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) హెచ్చరించింది. కరోనా కొత్త వేరియంట్ డిసెంబర్ నెలలో కేసులు వెలుగుచూశాయి. యూకే, అమెరికా లాంటి దేశాలతో పాటు భారత్‌లోనూ ఒమిక్రాన్ ప్రభావం చూపుతోంది. 


ఒమిక్రాన్ కేసులు నమోదయ్యే తొలి రోజుల్లో భయపడిన దాని కన్నా పరిస్థితి అంత తీవ్రతరం కాదని తాము భావించామని డబ్ల్యూహెచ్‌ఓ సీనియర్ ఎమర్జెన్సీ ఆఫీసర్ కేథరీన్ స్మాల్‌వుడ్ తెలిపారు. ప్రస్తుతం ఇన్‌ఫెక్షన్ రేటు పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు పాటించకపోతే పరిస్థితి అదుపు తప్పుతుందన్నారు. డేల్టా వేరియంట్ ద్వారా సంభవించిన మరణాలు, కేసుల కన్నా ఒమిక్రాన్ కేసులు, మరణాలు తక్కువగా ఉన్నాయి. కానీ ఇన్‌ఫెక్షన్ రేటు భారీగా పెరగడంతో ఇది మరింత ప్రమాదకర కొత్త వేరియంట్లకు దారి తీయవచ్చునని అభిప్రాయపడ్డారని కాలిఫోర్నియా టైమ్స్ రిపోర్ట్ చేసింది.  


తీవ్రత తక్కువగా ఉండటంతో ఒమిక్రాన్ నుంచి త్వరగా కోలుకుంటామని శాస్త్రవేత్తలు భావించారు. కానీ ఐరోపాలో పాండమిక్ మొదలైనప్పటి నుంచీ 100 మిలియన్లకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, 2021 చివరి వారంలో 5 మిలియన్లకు పైగా కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయని స్మాల్‌వుడ్ తెలిపారు. ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్లు పెరగడంతో ఆసుపత్రి సిబ్బందికి భారంగా మారింది. స్కూళ్లు మూసేస్తున్నారు. రవాణా సౌకర్యాలకు అంతరాయం కలగడంతో పాటు మార్కెట్లకు తీరని నష్టాన్ని మిగిల్చాయని వివరించారు.


ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉండగానే తాజాగా మరొక కొత్త వేరియంట్ బయటపడింది. ఒమిక్రాన్ కంటే వేగంగా ఇది సోకుతున్నట్లు తేలింది. ఈ కొత్త మ్యుటేషన్ పేరు ఐహెచ్‌యూ (బీ.1.640.2). ఫ్రాన్స్‌లోని ఐహెచ్‌యూ మెడిటరనీ ఇన్‌ఫెకన్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ కొత్త మ్యుటేషన్‌ను గుర్తించారు. ఆ సంస్థ పేరునే వేరియంట్‌కు పెట్టారు.


యూరప్‌లో దారుణం..
కరోనా ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతం యూరప్ అని, పశ్చిమ యూరప్‌లో తీవ్రత అధికంగా ఉండటంతో ప్రాణ నష్టం అధికమవుతోంది. ఫ్రాన్స్ పరిశోధకులు కొవిడ్ కొత్త వేరియంట్ ఐహెచ్‌యూను గుర్తించారు. కామెరూన్ కు చెందిన వ్యక్తిలో తొలి కేసును నిర్ధారించిన అనంతరం దీనికి ఐహెచ్‌యూగా నామకరణం చేశారు. ఫ్రాన్స్‌లో మంగళవారం ఒక్కరోజే 2,71,686 కరోనా కేసులు పుట్టుకొచ్చాయి. కేవలం గత వారంలోనే 95 శాతం కొత్త కరోనా కేసులు నిర్ధారణ కావడం దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. 


సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కొత్త వేరియంట్‌పై రీసెర్చ్ ప్రారంభించింది. జన్యు సంబంధ వివరాలను సీడీఎస్ సేకరిస్తోంది. గత ఏడాది అమెరికాలో కరోనా కేసులు పెరగడానికి ప్రధాన కారణం డేల్టా వేరియంట్. జూన్ చివర్లో ప్రారంభమై దేశాన్ని అల్లకల్లోలం చేసింది. అత్యధిక మరణాలు, మార్కెట్ కు తీవ్ర నష్టాన్ని డేల్టా వేరియంట్ కలిగించింది. నవంబర్ చివరికల్లా అమెరికాలో నమోదైన ఓవరాల్ కరోనా కేసులలో డేల్టా వేరియంట్ కేసులు, మరణాలు అధికమని తెలిసిందే. 


Also Read: Bengal Team Covid Positive: శివమ్‌ దూబె, బెంగాల్‌ రంజీ క్రికెటర్లలో ఏడుగురికి కరోనా


Also Read: AP Omicron Cases: ఏపీలో కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు... 24కు చేరిన మొత్తం కేసులు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి