అగ్రరాజ్యం అమెరికా కరోనా గుప్పిట్లో చిక్కుకుంది. కరోనా సునామీ వచ్చే ప్రమాదం ఉందని అక్కడి నిపుణులు అంచనా వేసిన రోజుల్లోనే ఆ తరహా పరిస్థితి కనిపిస్తోంది. సోమవారం ఒక్కరోజే అమెరికాలో పది లక్షలకుపైగా కేసులు నమోదైనట్లుగా జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రకటించారు. గురువారం ఈ సంఖ్య ఐదు లక్షలకు దిగువనే ఉంది. మూడు రోజులోనే రెట్టింపు అయింది. అయితే ఈ పది లక్షల కేసుల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఎన్ని అన్నదానిపై స్పష్టత లేదు. సాధారణ కరోనా వైరస్‌తో పాటు ఒమిక్రాన్ వైరస్ కూడా శరవేగంగా విస్తరిస్తోంది. ఒమిక్రాన్ వ్యాప్తి .. ఐదారు రెట్లు ఎక్కువగా నిపుణులు ఇప్పటికే నిర్ధారించారు.
Also Read: బీ అలర్ట్.. మరో కొత్త వేరియంట్ వచ్చేసింది.. ఒమిక్రాన్ కన్నా అంతకుమించి!
ఈ కారణంగా నమోదవుతున్న కేసుల్లో ఒమిక్రాన్ వేరియంట్ కూడా అత్యధికం ఉంటాయని భావిస్తున్నారు. కరోనా పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతూండటంతో అధ్యక్షుడు బైడెన్ , ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ..., కరోనా కట్టడికి నియమించిన ప్రత్యేక బృందంతో సమావేశం కావాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అమెరికాలో ఇప్పటికే వ్యాక్సినేషన్ రెండు డోసులు దాదాపుగా పూర్తయ్యాయి. అయితే వ్యాక్సినేషన్ వేసుకున్న వారికి సైతం కరోనా సులువుగా సోకుతూండటంతో..., బూస్టర్ డోసును పంపిణీ చేస్తున్నారు.
ఫైజర్ - బయోన్‌టెక్ సంస్థ తయారు చేస్తున్న బూస్టర్ డోస్ 12 నుంచి 15 ఏళ్ల వయసుగల వారికి కూడా వినియోగించేందుకు అత్యవసర అనుమతిని అమెరికా ఎఫ్‌డీఏ మంజూరు చేసింది. కరోనా కారణంగా అమెరికాలోని చాలా రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. టెస్టుల కోసం పెద్ద ఎత్తున జనం క్యూ కడుతున్నారు. మొదటి విడత కరోనా తరహా పరిస్థితులు ఇప్పుడు అమెరికాలో కనిపిస్తున్నాయి. అయితే మృతుల సంఖ్య మాత్రం అసాధారణ రీతిలో లేకపోడంతో అక్కడి ప్రభుత్వం ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆస్పత్రిలో చేరే వారు తక్కువగా ఉన్నప్పటికీ ముందు జాగ్రత్తగా పెద్ద ఎత్తున తాత్కాలిక వైద్య సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వం గతంలో తరహా అత్యవసర పరిస్థితులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.
Also Read: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కరోనా పాజిటివ్.. టెస్టులు చేయించుకోవాలని వారికి సూచన