దేశంలో ఒమిక్రాన్, కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1892కు పెరిగింది. మహారాష్ట్రలోనే అత్యధిక కేసులు ఉన్నాయి. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా 37,379 కరోనా కేసులు నమోదయ్యాయి. 11,007 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 124 మంది వైరస్‌తో మృతి చెందారు.









    • డైలీ పాజిటివిటీ రేటు: 3.24%

    • యాక్టివ్ కేసులు: 1,71,830

    • మొత్తం రికవరీలు: 3,43,06,414

    • మొత్తం మరణాలు: 4,82,017

    • మొత్తం వ్యాక్సినేషన్: 1,46,70,18,464








మహారాష్ట్ర.. 


మహారాష్ట్రలో కొత్తగా 12,160 కరోనా కేసులు నమోదయ్యాయి. 11 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 50 వేల మార్కు దాటింది. మొత్తం కేసుల సంఖ్య 67,12,028కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 1,41,553కు పెరిగింది. 

రాష్ట్రంలో కొత్తగా 68 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 578కి పెరిగింది. కొత్తగా నమోదైన 68 కేసుల్లో 40 ముంబయిలోనే ఉన్నాయి. పుణె నగరంలో 14, నాగ్‌పుర్‌లో 4, పుణె గ్రామీణం, పన్‌వేల్ నగరంలో చెరో 3, కొల్హాపుర్‌, నవీ ముంబయి, రాయ్‌గడ్, సతారాలో ఒక్కో కేసు నమోదయ్యాయి.


రాజస్థాన్.. 


రాజస్థాన్‌లో కొత్తగా 550 కరోనా కేసులు నమోదుకాగా 53 మందికి ఒమిక్రాన్ సోకింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 174 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి