బీట్‌రూట్, కొబ్బరి పాలు రెండూ పోషకాలు నిండిన పదార్థాలే. వీటితో సూప్ చేసుకుని తాగితే అందే ఆరోగ్యం అంతా ఇంతా కాదు. చలికాలం సాయంత్రం వేడివేడి సూప్ తాగితే గొంతు సమస్యలతో పాటూ, రక్తహీనత వంటివి దూరమవుతాయి. 


కావాల్సిన పదార్థాలు
ఉల్లిపాయలు చిన్నవి - రెండు
ఆలివ్ ఆయిల్ - తగినంత
క్యారెట్ - ఒకటి
అల్లం తురుము - అర టీస్పూను
పచ్చిమిర్చి తురుము - ఒక టీస్పూను
లెమన్ గ్రాస్ తురుము - ఒక టీ స్పూను
నిమ్మ ఆకులు - ఆరు
బీట్‌రూట్ తురుము - ఒక కప్పు
వెనిగర్ - ఒక టీస్పూను
వెజిటబుల్ స్టాక్ - పావు లీటర్
మిరియాల పొడి - అర టీస్పూను
ఉప్పు - తగినంత
కొబ్బరి పాలు - అరకప్పు
క్రీమ్ - ఒక టీస్పూను


ఎలా తయారు చేయాలి?
స్టవ్ పై కళాయి పెట్టి ఆలివ్ ఆయిల్ వేసి వేడిచేయాలి. తరువాత అందులో ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తరుగు, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, లెమన్ గ్రాస్, నిమ్మ ఆకులు వేసి బాగా కలపాలి. రెండు నిమిషాల తరువాత బీట్‌రూట్ తరుగును వేసి ఉడికించాలి. రైస్ వెనిగర్‌ను వేయాలి. వదిలేయకుండా కలుపుతూ ఉండాలి. మధ్యలో వెజిటబుల్ స్టాక్‌ను వేయాలి. అవి కాసేపు ఉడికాక మిరియాల పొడి, ఉప్పు, కొబ్బరి పాలు వేసి కలపాలి. పది నిమిషాల పాటూ ఉడించాలి. స్టవ్ కట్టేసి మిశ్రమాన్ని కాస్త చల్లార్చి మిక్సీలో  వేసి మెత్తగా చేయాలి. తగినన్ని నీళ్లు, క్రీమ్ కలపాలి. దీన్ని ఓసారి ఓవెన్ లో వేడి చేసుకుని మెల్లగా సిప్ చేయాలి. గొంతులోకి సూప్ జారుతుంటే ఎంత హాయిగా ఉంటుందో.  


Also read: కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం వీరికే ఎక్కువ... ఈ లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోవద్దు


Also read: ఫ్యామిలీని, ఫ్రెండ్స్‌ను ఇలా తెలుగులో విష్ చేయండి, మీ కోసం అందమైన కోట్స్‌ ఇవిగో...














ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.