వాండరర్స్‌ టెస్టులో టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ ఒడుదొడులకు మధ్య సాగుతోంది! మూడో రోజు లంచ్‌ విరామానికి 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. 161 పరుగుల ఆధిక్యంలో ఉంది. తెలుగు ఆటగాడు హనుమ విహారి (6; 26 బంతుల్లో 1x4), శార్దూల్‌ ఠాకూర్‌ (4; 3 బంతుల్లో 1x4) బ్యాటింగ్‌ చేస్తున్నారు. సీనియర్లు చెతేశ్వర్‌ పుజారా (53; 86 బంతుల్లో 10x4), అజింక్య రహానె (58; 78 బంతుల్లో 8x4, 1x6) అర్ధశతకాలతో ఆదుకున్నారు.


కాపాడిన పుజారా, రహానె






ఓవర్‌నైట్‌ స్కోరు 85/2తో మూడో రోజు, బుధవారం టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ ఆరంభించింది. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో త్వరగా ఓపెనర్ల వికెట్లు చేజార్చుకోవడంతో చెతేశ్వర్‌ పుజారా (35 ఓవర్‌నైట్‌ స్కోర్‌), అజింక్య రహానె (11 ఓవర్‌నైట్‌ స్కోరు) ఆచితూచి ఆడారు. బౌలర్లకు అనుకూలిస్తున్న పరిస్థితుల్లోనూ చక్కని స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశారు. గత మూడు ఇన్నింగ్సుల్లో విఫలమైన నయావాల్‌ 62 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్నాడు. ఆ తర్వాత జింక్స్‌ 67 బంతుల్లో హాఫ్‌ సెంచరీ అందుకోవడంలో 33.3 ఓవర్లలో టీమ్‌ఇండియా స్కోరు 150కి చేరుకుంది.






మూడో వికెట్‌కు 144 బంతుల్లో 111 పరుగుల భాగస్వామ్యం అందించిన ఈ జోడీని జట్టు స్కోరు 155 వద్ద రహానెను ఔట్‌ చేయడం ద్వారా రబాడా విడదీశాడు. మరికాసేపటకే రహానెనూ అతడే పెవిలియన్‌ పంపించాడు. రిషభ్ పంత్‌ (0)నూ వదల్లేదు. రవిచంద్రన్‌ అశ్విన్‌ (16) పోరాడేందుకు ప్రయత్నించాడు.


Also Read: Ranji Trophy Postpone: ఆటగాళ్లకు కరోనా ఎఫెక్ట్.. రంజీ ట్రోఫీ వాయిదా వేసిన బీసీసీఐ