ఒత్తిళ్లు, ఆర్ధిక ఇబ్బందులు శారీరక, మానసిక స్థితులపై ప్రభావం చూపిస్తాయి. వీటి వల్ల కోపం, విసుగు, అసహనం త్వరగా రావచ్చు. అయితే ఇవే కాదు, మీరు తినే ఆహారం కూడా కోపం, అసహనం త్వరగా వచ్చేలా చేస్తాయని చెబుతోంది ఓ కొత్త అధ్యయనం. అనారోగ్యకరమైన ఆహారం, శాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉండే చక్కెర కలిగిన ఆహారాలు తినడం వల్ల కూడా మానసిక స్థితిలో మార్పులు వస్తాయి. కొన్ని ఆహారాలు మనకు శక్తిని ఇస్తే, మరికొన్ని మానసికంగా, శారీరకంగా బలహీనంగా మారుస్తాయి. ముఖ్యంగా మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తాయి. నిదానం అనేది తగ్గిపోతుంది. కోపం పెరిగిపోతుంది. 


ఈ పరిశోధన 945 మంది పురుషులు, మహిళలపై నిర్వహించారు. వారు తినే ఆహారాన్ని బట్టి వారిలోని మార్పులను పరిశీలించారు. ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉండే ఆహారం తినేవారిలో త్వరగా కోపం వస్తున్నట్టు  గుర్తించారు. ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే కొవ్వుకు అత్యంత ప్రమాదకరమైన రూపం. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి. వీటి వల్ల కాల క్రమేణా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. ఈ కొవ్వులు హైడ్రోజనేటెడ్ ఆహారాలలో  అధికంగా ఉంటాయి. 


ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉండే ఆహారాలు ఇవే...
ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలలో ఉంటాయి. 
1. ప్యాకేజ్డ్ స్నాక్స్
2. ఫ్రోజెన్ ఆహారాలు
3. డీప్ ఫ్రై చేసిన ఆహారాలు
4. కుకీస్
5. బేకింగ్ మిక్స్‌లు
6. మైక్రెవేవ్ పాప్ కార్న్
7. నాన్ డెయిర్ క్రీమర్స్
8. బేక్ చేసిన ఆహారాలు


గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.













ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.