వయసు పైబడుతున్న కొద్దీ చాలా రోగాలు దాడిచేస్తుంటాయి. వాటిలో ముఖ్యమైనది కంటి చూపు మందగించడం. కంటి చూపు సమస్యలు రాకుండా ఉండాలే ఎండు గోజి బెర్రీలను డైట్ లో చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇవెక్కడ దొరుకుతాయో అని దీర్ఘంగా ఆలోచించకండి... ఆన్‌లైన్ షాపుల్లో అందుబాటులో ఉన్నాయి. ‘డ్రైడ్ గోజి బెర్రీస్’ అని వెతికితే చాలు ఇట్టే దొరికేస్తాయి. వీటి ధర క్వాలిటీని బట్టి 200 గ్రాములు రూ.300 నుంచి మొదలవుతాయి.
ఇంతవరకు మనం బీటా కెరాటిన్ అధికంగా ఉంటే క్యారెట్లు వంటి వాటిని కంటి చూపు కోసం తినేవాళ్లు. క్యారెట్లను మించిన మేలు గోజి బెర్రీలు చేస్తాయి. ఇవి లైసియం, చినెన్స్, లైసియం బార్బరమ్ అని పిలిచే రెండు రకాల పొదలకు కాసే చిన్న పండ్లు. వీటిని ఎండబెట్టి చైనీయులు డబ్బాల్లో దాచుకుంటారు. సూప్‌లలో వీటిని వేసుకుని తింటారు. అలాగే చిరుతిళ్లుగా కూడా ఉపయోగిస్తారు. చైనీస్ వైద్యంలో కూడా వీటిని వినియోగిస్తారు. వీటిలో జియాక్సంతిన్ లభిస్తుంది. దీన్ని శరీరం వెంటనే గ్రహించి వినియోగించుకుంటోంది.
అధ్యయనం ఏం చెబుతుంది?
న్యూట్రియెంట్స్ జర్నల్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం ఎండిన గోజీ బెర్రీలను క్రమం తప్పకుండా తింటే కళ్లల్లో మచ్చలు రావడం, సైట్ రావడం, ఇతర దృష్టి లోపాలు రాకుండా అడ్డుకుంటుంది. మధ్య వయసు నుంచే వీటిని తినడం ప్రారంభిస్తే పెద్ద వయసు వచ్చేటప్పుడు ఎలాంటి కంటి సమస్యలు, చూపు లోపాలు లేకుండా హాయిగా జీవించవచ్చు. గోజీబెర్రీలలో ఉండే లుటీన్, జియాక్సంతిన్లు హానికరమైన నీలి కాంతిని ఫిల్టర్ చేసి యాంటీ ఆక్సిడెంట్ రక్షణను అందిస్తాయి. వృద్ధాప్యంలో చూపును రక్షించడంలో సహాయపడతాయి. అంతేకాదు క్యాన్సర్, గుండె సంబంధిత రోగాల నుంచి కూడా కాపాడతాయి.
గోజి బెర్రీలు టిబెట్, చైనాలలో అధికంగా పండుతాయి. అందుకే వీటిని టిబెటన్ గోజి, హిమాలయన్ గోజి అని కూడా పిలుస్తారు. అయితే ప్రపంప వ్యాప్తంగా అధికంగా అమ్ముడయ్యేది మాత్రం చైనా నుంచే. చైనాలోని నింగ్జియా ప్రాంతమే ఈ గోజిబెర్రీల పుట్టినిల్లని చెబుతారు. వీటిని రోజుకు ఓ అర గుప్పెడు తిన్నా చాలు.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు, పాలు కలిపి తింటున్నారా? ఈ సమస్య ఉన్న వాళ్లు తినకూడదు
Also read: పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? ఈ సమస్యలు తప్పవు, ముఖ్యంగా డయాబెటిక్ వారు...
Also read: నా పేరు కోవిడ్... నేను వైరస్‌ను కాను, పేరుతో ఆ కోటీశ్వరుడికి కష్టాలు
Also read: బరువు తగ్గించి, శక్తిని పెంచే ప్రోటీన్ షేక్.. ఇంట్లో ఇలా సులువుగా తయారుచేయచ్చు
Also read: కాఫీ తాగే పద్దతి ఇది... మీ ఆరోగ్యం కోసం ఈ చిట్కాలు పాటించాల్సిందే