చీర కొనలేదనో, చెప్పిన సమయానికి రాలేదనో, అత్త తిట్టిందనో... ఇలా రకరకాల కారణాల వల్ల విడిపోతున్న జంటలు ఎన్నో. అవేవీ పెద్ద సమస్యలు కాకపోయినా వాటినే చాలా పెద్దవిగా భావించి  విడాకులు తీసుకుంటున్నట్టు వారు ఎంతోమంది. కానీ జాన్, జాయ్సీ ఎన్ని కష్టాలొచ్చినా ఒకరి వెంట ఒకరు నిలిచారు. ప్రపంచంలోనే అత్యధిక సంవత్సరాలు భార్యాభర్తలుగా నిలిచిన వారిగా ప్రపంచ రికార్డు సృష్టించబోతున్నారు. వీరిద్దరూ బ్రిటన్‌కు చెందిన వారు.  


ప్రపంచయుద్ధం జరుగుతున్నప్పుడు....
రెండె ప్రపంచయుద్ధం మొదలైంది. రాన్ ఆ సమయంలో యూకే మిలటరీలో సైనికుడిగా ఉన్నాడు. 1940లో యుద్ధం సాగుతున్న సమయంలోనే వీరికి పరిచయమైంది. 1941 జనవరి 4న పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లి ఫ్యాన్సీగా, రొమాంటిక్‌గా చర్చిలో జరగలేదు, ఒక రిజిస్టర్ ఆఫీసులో చాలా సింపుల్‌గా తక్కువ మంది స్నేహితుల మధ్యలో జరిగింది. స్నేహితుల్లో కొంతమంది ‘తక్కువ సమయం పరిచయంతోనే పెళ్లిచేసుకున్నారు వీరెన్నాళ్లు కలిసుంటారు’ అంటూ కామెంట్లు చేశారు. కానీ అందరు ఆశ్చర్యపోయేలా వీరి జంట ప్రయాణం 81 ఏళ్లు నిర్విరామంగా సాగుతూ వస్తోంది. వివాహ సమయానికి రాన్ వయసు 21 కాగా, జోయ్సీ వయసు 19.  


పెళ్లి అయిన నాలుగురోజులకే భార్యను వదిలి యుద్ధపనులపై వేరే దేశం వెళ్లిపోయాడు రాన్. వచ్చాక ఇద్దరూ సంతోషంగా జీవించసాగారు. వారిద్దరికి ఒక కొడుకు, ఒక కూతురు. ఇప్పుడు వీరికి ముగ్గురు మనవరాళ్లు, ఆరుగురు ముని మనవలు, మనవరాళ్లు, ఒక ముని ముని మనవడు ఉన్నారు. గతేడాది 80వ పెళ్లిరోజు సందర్భంగా వీరికి బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ ‘కంగ్రాచ్యులేషన్స్’ చెబుతూ ఒక గ్రీటింగ్ కార్డు పంపించారు. 


ప్రేమే నడపింది...
ఇన్నాళ్లు తమను జంటగా నడిపింది ప్రేమ, నమ్మకమేనని చెబుతున్నారు ఈ అపురూపమైన జంట. సుఖాల్లోనే కాదు, కష్టాల్లోను తోడుగా సాగే జంటల మధ్య అన్యోన్యోత పెరుగుతుందని, తాము ఎన్ని కష్టాలొచ్చినా జంటగానే ఎదుర్కొన్నామని చెప్పారు రాన్.


Also read:  నోరు చప్పగా అనిపించినప్పుడు ఇలా మసాలా రైస్ చేసుకుంటే... అదిరిపోతుంది 


Also read: ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన మద్యం ఇది... వేదాలలో కూడా దీని ప్రస్తావన?



Also read: ఎండుద్రాక్షల్లా కనిపించే వీటిని తింటే కళ్లద్దాల అవసరం రాదట... కంటిచూపును కాపాడే దివ్యౌషధాలు


Also read: పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? ఈ సమస్యలు తప్పవు, ముఖ్యంగా డయాబెటిక్ వారు...


Also read: నా పేరు కోవిడ్... నేను వైరస్‌ను కాను, పేరుతో ఆ కోటీశ్వరుడికి కష్టాలు





 ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.