సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ పండక్కి నాన్ వెజ్ తినడం ఆనవాయితీ. అందులోనూ ఈసారి కనుమ ఆదివారం వచ్చింది. ఈ రెండు సందర్భాలు కలిస్తే ప్రజలు ఆగుతారా? మాంసాహారాన్ని లాగించేశారు. ఎందుకంటే ఈ పండగ సీజన్‌లో నమోదైన అమ్మకాలు చూస్తే దిమ్మతిరిగిపోతోంది. ఈ శుక్రవారం నుంచి ఆదివారం వరకు కేవలం హైదరాబాద్ పరిధిలో సుమారు 60 లక్షల కిలోల చికెన్‌‌ను మాంసాహార ప్రియులు కొనుగోలు చేశారు. ఈసారి మటన్‌ కంటే ఎక్కువగా చికెన్‌ వైపే ప్రజలు మొగ్గుచూపారు. ఇందుకు కారణం చికెన్‌ ధర మటన్‌ కంటే చాలా తక్కువగా ఉండటమే. 


Also Read: TS High Court: రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాల్సిందే.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు


మేక మాంసం ధర కిలో రూ.850 నుంచి రూ.900 మధ్య ఉండగా.. చికెన్‌ ఈ సీజన్‌లో కిలోకు రూ.240 వరకూ పలికింది. గ్రేటర్‌ పరిధిలో సాధారణంగా రోజుకు సగటున 10 లక్షల కిలోల చికెన్‌ అమ్ముడవుతూ ఉంటుంది. కానీ, ఈ శుక్ర, శనివారాల్లోనే దాదాపు 30 లక్షల కిలోల చికెన్‌ అమ్మకాలు జరగగా.. ఇక కనుమ రోజు అయిన ఆదివారం ఒక్కరోజే ఏకంగా మరో 30 లక్షల కిలోల చికెన్‌ అమ్ముడుపోయినట్లు వ్యాపారులు అంచనా వేశారు. 


Also Read: ‘టెస్లాను తెచ్చేద్దాం కేటీఆర్ అన్నా..’ కేటీఆర్‌కు భలే మద్దతు.. విజయ్ దేవరకొండ, జెనీలియా సహా డైరెక్టర్స్ కూడా..


మటన్ విషయంలో మామూలు రోజుల్లో రోజుకు సగటున రెండు లక్షల కిలోల అమ్మకాలు జరుగుతాయి. ఇక ఆదివారం ఏకంగా 5 లక్షల కిలోల మటన్‌‌ను హైదరాబాదీలు కొనుగోలు చేశారు. గత మూడు రోజుల్లో మటన్‌ దాదాపు 10 నుంచి 15 లక్షల కిలోల విక్రయాలు జరిగినట్లు వ్యాపారులు  అంచనా వేశారు. ఇలా భారీ మొత్తంలో అమ్మకాలు సాగడంపై వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి హైదరాబాద్ నుంచి చాలా మంది ఇళ్లకు వెళ్లిన సందర్భంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో అమ్మకాలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.


దసరాకు అమ్మకాలు ఇలా..
గత ఏడాది దసరా సమయంలో చికెన్ అమ్మకాలు రెండ్రోజుల వ్యవధిలో దాదాపు 50 లక్షల కిలోలు సేల్ అయింది. మటన్‌ ధర ఎక్కువగా ఉండడంతో గ్రేటర్‌ ప్రజలు మటన్‌ కంటే ఎక్కువగా చికెన్‌కు ప్రాధాన్యం ఇచ్చారు.


Also Read: TS Cabinet: రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ, థియేటర్లపై ఆంక్షలు ఉంటాయా? నేడే కేబినెట్ భేటీ


Also Read: Formula E Hyderabad : లండన్, న్యూయార్క్ అండ్ హైదరాబాద్.. "ఫార్ములా ఈ" కార్ రేసులకు వేదికగా భాగ్యనగరం !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి