తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఓమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున ఆర్టీ పీసీఆర్‌ పరీక్షల సంఖ్య భారీగా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రోజుకు లక్ష ఆర్టీ పీసీఆర్‌ పరీక్షలు చేయాలని ఆదేశించింది. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్‌ పరీక్షల వివరాలకు సంబంధించిన లెక్కలు వేర్వేరుగా పేర్కొనాలని సూచించింది. భౌతిక దూరం, మాస్కుల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని.. కరోనా వ్యాప్తి నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా నియంత్రణపై ఇవాళ మంత్రివర్గం చర్చిస్తున్నట్లు అడ్వకేట్ జనరల్ వెల్లడించారు. అనంతరం ఆ పిటిషన్ల విచారణను ఈనెల 25కు హైకోర్టు వాయిదా వేసింది.


Also Read: KCR: తెలంగాణ పాలన సంస్కరణలు, ఉద్యోగాల భర్తీపై కేసీఆర్ కీలక నిర్ణయం.. నలుగురు ఐఏఎస్‌లతో..


ఈ నెల 12 వరకు తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ రిపోర్టు ఆధారంగా హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 12 వరకు మేడ్చల్ జిల్లాలో అత్యధికంగా 6.95 పాజిటివిటీ రేటు నమోదైందని ప్రభుత్వం నివేదికలో పేర్కొంది. అలాగే జీహెచ్‌ఎంసీలో 5.65 శాతం పాజిటివిటీ రేటు ఉన్నట్లు అధికారులు తమ నివేదికలో కోర్టుకు తెలిపారు.


Also Read: TS Cabinet: రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ, థియేటర్లపై ఆంక్షలు ఉంటాయా? నేడే కేబినెట్ భేటీ


వర్చువల్ ద్వారానే విచారణ
వేగంగా పెరుగుతున్న కరోనా కేసుల వల్ల హైకోర్టులో రేపట్నుంచి వర్చువల్‌గా కేసుల విచారణ జరగనుంది. ఆన్‌లైన్‌లోనే పూర్తిస్థాయి విచారణలు చేపట్టనున్నట్లు హైకోర్టు వర్గాలు తెలిపాయి. కొవిడ్‌ వ్యాప్తి వల్ల మళ్లీ వర్చువల్‌ విచారణలు జరపనున్నట్లు హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది.


Also Read: Kothagudem TRS: వనమా రాఘవ అరెస్టుతో టీఆర్ఎస్ నేతలు ఎవరికి వారే యమునా తీరుగా.. బెనిఫిట్ ఎవరికో!


Also Read: Warangal: వరంగల్‌లో దూకుడు పెంచిన బీజేపీ.. సరికొత్త వ్యూహాలు, అధిష్ఠానం మద్దతుతో దూసుకెళ్తూ..


Also Read: ‘టెస్లాను తెచ్చేద్దాం కేటీఆర్ అన్నా..’ కేటీఆర్‌కు భలే మద్దతు.. విజయ్ దేవరకొండ, జెనీలియా సహా డైరెక్టర్స్ కూడా..


Also Read: Ambati Rambabu Covid Positive: అంబటి రాంబాబుకు కరోనా.. మూడోసారి కొవిడ్ బారిన పడిన YSRCP ఎమ్మెల్యే 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి