Ambati Rambabu Tested Corona Positive For Third Time: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. డేల్టా వేరియంట్ సమయంలో తరహాలో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గతంలో ఒకట్రెండు పర్యాయాలు కరోనా బారిన పడిన వారికి సైతం మళ్లీ కరోనా సోకే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇకనైనా జాగ్రత్తలు తీసుకోవాలని కొవిడ్19 నిబంధనలు కచ్చితంగా పాటించాలని ప్రజలకు సూచించారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మరోసారి కరోనా బారిన పడ్డారు.


అంబటి రాంబాబు గతంలో రెండు పర్యాయాలు కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా మరోసారి తనకు కరోనా సోకినట్లు ఆయన వెల్లడించారు. జలుబు, దగ్గు లాంటి లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకోగా తనకు కరోనా పాజిటివ్ గా వైద్యులు నిర్ధారించినట్లు తెలిపారు. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్‌కు వెళ్తున్నానని, గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు కరోనా నిర్ధారణ టెస్టులు చేయించుకోవాలని అంబటి రాంబాబు కోరారు. తాను కరోనా బారిన పడ్డానని, ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నానని.. తనను ఎవరూ డిస్టర్బ్ చేయవద్దని కోరుతూ వీడియో విడుదల చేశారు.







భోగి రోజు అంబటి రాంబాబు డ్యాన్స్..
గుంటూరు జిల్లా సత్తెనపల్లి గాంధీ బొమ్మ కూడలిలో నిన్న భోగి వేడుకల్లో ఎమ్మెల్యే అంబటి రాంబాబు సందడి చేశారు. కొందరు కళాకారులు సంప్రదాయ దుస్తులతో నృత్యాలు చేస్తుండగా... వారితో కలిపి ఆయన కాలు కదిపారు. తన డ్యాన్సులతో అలరించారు. ఆ వీడియో వైరల్ అవుతోంది. మాస్కు లేకుండా సంక్రాంతి సంబరాలు చేసుకున్న ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అంబటిని ఇటీవల కలిసిన వారు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల ఆయన కోవిడ్19 నిబంధనలు పాటించకపోవడంతోనే కరోనా వైరస్ మూడోసారి అటాక్ చేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.



రెండు పర్యాయాలు కరోనాపై విజయం..
కరోనా ఒక్కసారి సోకితే మళ్లీ రాదని భావించకూడదని నిపుణులు దేశ ప్రజలను హెచ్చరిస్తున్నారు.  తాజాగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా సోకడం ఇది మూడో సారి. 2020లో జూలైలో తొలిసారి అంబటికి కరోనా సోకింది. కొన్ని రోజులకే ఆయన కరోనాను జయించారు. ఆపై అదే ఏడాది డిసెంబర్ నెలలో రెండోసారి కోవిడ్ బారిన పడ్డారు. అసెంబ్లీలో కోవిడ్ టెస్ట్ చేయించగా కరోనా నిర్ధారణ అయింది. తనకు రెండోసారి కరోనా సందర్భంగా ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొని చిందులు వేసిన ఎమ్మెల్యే మూడోసారి కరోనా బారిన పడటం పార్టీ కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది.


Also Read: Booster Dose: కోవిడ్ వ్యాక్సిన్‌ - బూస్టర్ డోస్‌‌కు తేడా ఏమిటీ? ఎవరు అర్హులు? ఏది బెస్ట్?


Also Read: గొంతులు కోస్తున్న చైనా మాంజా.. నిషేధం విధించినా జోరుగా అమ్మకాలు ! ఇంకెంత మంది ప్రాణాలు పోవాలి ?


Also Read: Weather Updates: ఏపీకి తప్పని కుండపోత వర్షాలు.. ఈ ప్రాంతాల్లో ఉరుములు కూడా.. తెలంగాణలో వెదర్ ఇలా..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి