ఏపీలో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ విభాగం అధికారులు ప్రకటించారు. అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. నిన్న నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం మీద సగటుమట్టానికి 1.5 కిలో మీటర్లు ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం, ఈ రోజు అదే ప్రాంతంలో తక్కువగా గుర్తించారు. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల వరకూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉత్తర కోస్తా, యానం ప్రాంతాల్లో నేటి నుంచి మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. అంతేకాక, మెరుపులు, ఉరుములు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రలో కూడా నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు కూడా ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
రాయలసీమ ప్రాంతంలో రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో కూడా ఉరుములు, మెరుపులు ఉండవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు.
తెలంగాణలో ఇలా..
తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని చోట్ల పెద్ద వర్షాలు, మరికొన్ని చోట్ల వడగండ్లు కూడా కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల ప్రకారం.. జనవరి 16న నుంచి రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. వర్షాలకు సంబంధించి ఎలాంటి హెచ్చరిక జారీ చేయలేదు. ఈ నెల 19వ తేదీ వరకూ వాతావరణం పొడిగానే ఉంటున్నట్లుగా హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అదికారులు అంచనా వేశారు.
Also Read: గొంతులు కోస్తున్న చైనా మాంజా.. నిషేధం విధించినా జోరుగా అమ్మకాలు ! ఇంకెంత మంది ప్రాణాలు పోవాలి ?
Also Read: హేమమాలిని ప్లేస్‌లోకి కంగనా ! రాజకీయ నేతలూ బ్రాండ్ అంబాసిడర్లను మార్చేస్తారా ?
Also Read: యూపీ సీఎంగా తొలి ప్రాధాన్యత ఎవరికి?.. ABP- సీ ఓటర్ సర్వే ఫలితాలు ఇవే!