ఎక్కడైనా ఎమ్మెల్యేలు .. సామాన్యుల్ని కొడుతూ ఉంటారు. చిరాకు పుడితే చేతికి అందిన వారిని ఒక్కటిచ్చుకుంటారు. కానీ ఒక్కో సారి సీన్లు రివర్స్ అవుతూ ఉంటాయి. ఎమ్మెల్యేల చెంప చెళ్లుమంటూ ఉంటుంది. అరుదుగా జరిగినా హైలెట్ అవుతూ ఉంటాయి. ఉత్తరాదిలో ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలకు ఇలాంటి చిక్కులు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. రైతుల నుంచి వారు తమ చెంపలను కాపాడుకోవడం కష్టమవుతోంది. కానీ ఎన్నికల సమయం కాబట్టి అలా చేయి విసిరిన రైతులను సైతం ప్రేమతో చూస్తున్నారు. 


Also Read: యూపీ సీఎంగా తొలి ప్రాధాన్యత ఎవరికి?.. ABP- సీ ఓటర్ సర్వే ఫలితాలు ఇవే!


ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావో బీజేపీ ఎమ్మెల్యే  పంకజ్ గుప్తా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయన ఇప్పటికే ఎన్నికల ప్రచారం జోరుగా చేస్తున్నారు. ఈ క్రమంమలో తన నియోజకవర్గంలో ఓ గ్రామంలో  సభ ఏర్పాటుచేశారు. జనం కూడా వచ్చారు. సభ ఉత్సాహంగా నడుస్తున్న సమయంలో ఓ రైతు వచ్చి... ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించాడు. దీంతో అతన్ని సెక్యూరిటీ సిబ్బంది అక్కడ్నుంచి తీసుకెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 


 





Also Read: UP Election 2021: 'యూపీ ఎలక్షన్లు 2024 సాధారణ ఎన్నికలకు సెమీస్ కావు'


అయితే రైతు చెంప మీద కొట్టినా ఎమ్మెల్యే ఆవేశపడలేదు. ఆ రైతును తోసేయబోయిన వారిని సముదాయించారు. దీంతో సభ తర్వాత సజావుగా సాగిపోయింది. అయితే ఈ వీడియో ఇంటర్నెట్‌లోకి రావడంతో ఆ ఎమ్మెల్యేకి ఇబ్బందికరంగా మారింది. యూపీలోని ఇతర రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని రాజకీయం చేశాయి. దీంతో ఎమ్మెల్యే విరుగుడు ఆలోచించారు. దాని ప్రకారం వెంటనే మరో వీడియో రిలీజ‌ అయింది. 


 





Also Read: పంజాబ్ ఎన్నికల్లో భాజాపా- కెప్టెన్ దోస్తీ.. 101 శాతం విజయం తమదేనని ధీమా


ఆ వీడియోలో ఎమ్మెల్యేను చెంపదెబ్బకొట్టిన రైతు వివరణ ఇస్తూ కనిపించారు. తాను ఎమ్మెల్యేను కొట్టలేదని.. ప్రేమగా నిమిరానన్నారు. చాలా సార్లు అలా చేశానని కొత్తేం కాదని కూడా చెప్పారు. దీంతో తనను కొట్టలేదని ఎమ్మెల్యే.. తాను కొట్టలేదని రైతు కూడా ఫిక్సయిపోయి వివాదాన్ని ముగించే ప్రయత్నం చేశారు. కానీ వీడియో మాత్రం వైరల్ అవుతూ ఉంది. 


Also Read: Karnataka Congress MLA: 'స్పీకర్ సారు, ఎమ్మెల్యే గారు.. అది జోక్ కాదండి.. బాధ్యత ఉండక్కర్లేదా?'



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి