ABP  WhatsApp

BJP-Amarinder alliance: పంజాబ్ ఎన్నికల్లో భాజాపా- కెప్టెన్ దోస్తీ.. 101 శాతం విజయం తమదేనని ధీమా

ABP Desam Updated at: 17 Dec 2021 07:41 PM (IST)
Edited By: Murali Krishna

రానున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా- అమరీందర్ సింగ్ పార్టీ కలిసి పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి.

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసే భాజపా-అమరీందర్ సింగ్ పోటీ

NEXT PREV

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కెప్టెన్ అమరీందర్ సింగ్ పార్టీతో కలిసి పోటీ చేస్తున్నట్లు భాజపా స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ ప్రకటించారు.



దాదాపు 7 దఫాలు చర్చించిన తర్వాత.. పంజాబ్ లోక్‌ కాంగ్రెస్‌తో కలిసి రానున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించాం. సీట్ల పంపకం వంటి విషయాలపై త్వరలోనే చర్చిస్తాం.                                                           - గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర మంత్రి


మాదే గెలుపు..







కేంద్ర మంత్రి, పంజాబ్ భాజపా రాజకీయ వ్యవహారాల ఇంఛార్జ్ గజేంద్ర సింగ్ షెకావత్‌ను ఈ రోజు దిల్లీలో కలిశాను. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై చర్చించాం. 2022 ఎన్నికల్లో భాజపా, పంజాబ్ లోక్ కాంగ్రెస్ కలిసి పోటీ చేయనున్నట్లు అధికారికంగా చెబుతున్నాం.                                          - కెప్టెన్ అమరీందర్ సింగ్, పంజాబ్ మాజీ సీఎం



పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. విజయావకాశలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గాల వారీగా చర్చించి సీట్ల పంపకం చేస్తాం. 101 శాతం విజయం మాదే.                                             - కెప్టెన్ అమరీందర్ సింగ్, పంజాబ్ మాజీ సీఎం


పంజాబ్ ఎన్నికలు..


పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈసారి కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ, అమరీందర్ సింగ్ పార్టీ మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాలకు గాను కాంగ్రెస్ 77 సీట్లు గెలుపొంది ప్రభుత్వం ఏర్పాటు చేసింది.


ఆమ్‌ఆద్మీ పార్టీ 20 స్థానాలు గెలుపొంది ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. సిరోమణి అకాలీ దళ్ 15 సీట్లు గెలవగా, భాజపా మూడు స్థానాల్లో విజయం సాధించింది.


Also Read: India's Omicron Tally: దేశంలో 100 దాటిన ఒమిక్రాన్ కేసులు.. 11 రాష్ట్రాల్లో వ్యాప్తి


Also Read: Karnataka Congress MLA: 'స్పీకర్ సారు, ఎమ్మెల్యే గారు.. అది జోక్ కాదండి.. బాధ్యత ఉండక్కర్లేదా?'


Also Read: Omicron Cases in Delhi: దేశ రాజధానిలో ఒమిక్రాన్ దడ.. కొత్తగా మరో 10 కేసులు


Also Read: Miss World 2021: మిస్ వరల్డ్ పోటీలపై కరోనా పంజా.. మిస్ ఇండియా సహా 17 మందికి సోకిన వైరస్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 17 Dec 2021 07:40 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.