దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 100 దాటేసింది. దిల్లీలో కొత్తగా 10 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 101కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 11 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే వీరందరి ఆరోగ్యం నిలకడగానే ఉంది.


దిల్లీలో..


దేశ రాజధాని దిల్లీలో కొత్తగా మరో 10 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దీంతో దిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 20కి చేరింది. ఈ మేరకు దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ ప్రకటించారు. 20 మందిలో 10 మంది ఇప్పటికే నెగెటివ్ రావడంతో డిశ్ఛార్జ్. అయినట్లు తెలిపారు.


ప్రపంచవ్యాప్తంగా 77 దేశాల్లో ఒమిక్రాన్ విస్తరించింది. ఒమిక్రాన్ సోకి యూకేలో ఒకరు మరణించారు. ఇదే ఒమిక్రాన్ తొలి మరణం.


కరోనా కేసులు..


దేశంలో కరోనా కేసుల సంఖ్య 10 వేల కంటే తక్కువే నమోదవుతున్నాయి. కొత్తగా 7,447 కరోనా కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 86,415కు చేరింది. తాజాగా 391 మంది వైరస్‌తో మృతి చెందారు. 7,886 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 


మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.25గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.38గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యధికం.


జోరుగా వ్యాక్సినేషన్..







దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది. బుధవారం 70,46,805 మందికి టీకాలు వేశారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,35,99,96,267కు చేరింది.


Also Read: Karnataka Congress MLA: 'స్పీకర్ సారు, ఎమ్మెల్యే గారు.. అది జోక్ కాదండి.. బాధ్యత ఉండక్కర్లేదా?'


Also Read: Omicron Cases in Delhi: దేశ రాజధానిలో ఒమిక్రాన్ దడ.. కొత్తగా మరో 10 కేసులు


Also Read: Miss World 2021: మిస్ వరల్డ్ పోటీలపై కరోనా పంజా.. మిస్ ఇండియా సహా 17 మందికి సోకిన వైరస్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి