Miss World 2021: మిస్ వరల్డ్ పోటీలపై కరోనా పంజా.. మిస్ ఇండియా సహా 17 మందికి సోకిన వైరస్

ABP Desam Updated at: 17 Dec 2021 12:15 PM (IST)
Edited By: Murali Krishna

మిస్ వరల్డ్ 2021 పోటీలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. మిస్ ఇండియా మానసా వారణాసి సహా 17 మంది అభ్యర్థులకు కరోనా సోకింది.

మిస్ ఇండియా సహా 17 మంది అభ్యర్థులకు కరోనా

NEXT PREV

మిస్ వరల్డ్ 2021 ఫినాలేపై కరోనా పంజా విసిరింది. మిస్ ఇండియా మనసా వారణాసి సహా ఈ పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లిన మొత్తం 17 మంది అభ్యర్థులకు కరోనా బారిన పడ్డారు. దీంతో పోటీలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు మిస్ వరల్డ్ అధికారికంగా ప్రకటించింది.







అభ్యర్థులు చాలా మంది కరోనా వైరస్ బారిన పడటం వల్ల మిస్ వరల్డ్ 2021 పోటీలను వాయిదా వేయాలని నిర్ణయించాం.                           - మిస్ వరల్డ్ టీం


చికిత్స..


17 మంది అభ్యర్థులు సహా మరికొంతమంది సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది టీం. ఈ పోటీలు ప్యూర్టోరికో వేదికగా డిసెంబర్ 16 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇలా జరగడంతో తాత్కాలికంగా వాయిదా వేశారు. రానున్న 90 రోజుల్లో పోటీలను రీషెడ్యూల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


తెలుగమ్మాయి..


మిస్ వరల్డ్ 2021 పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లిన మిస్ ఇండియా మానస వారణాసి కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని మిస్ ఇండియా ఆర్గనైజేషన్ తెలిపింది. ప్రస్తుతం ఆమె ప్యూర్టోరికోలో ఐసోలేషన్‌లో ఉన్నారు.







మానసా వారణాసి.. ప్రపంచ వేదికపై భారత అందాన్ని చూపలేకపోతున్నారంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. ఆమె చేసిన కృషి ఎక్కడికీ పోదు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యమే మాకు ముఖ్యం. ఆమెను వీలైనంత త్వరగా భారత్‌కు రప్పించి, ఆరోగ్యంగా మార్చి ఇంకా స్ట్రాంగ్‌గా పోటీలకు పంపేందుకు సిద్ధంగా ఉన్నాం.                   - మిస్ ఇండియా ఆర్గనైజేషన్


తెలంగాణకు చెందిన మానస వారణాసి ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మిస్ ఇండియా 2020 పోటీల్లో విజేతగా నిలిచారు. భారత్ తరఫున 70వ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు ఆమె ప్యూర్టోరికో వెళ్లారు.


Also Read: Congress MLA: అత్యాచారం అనివార్యమైతే హ్యాపీగా ఎంజాయ్ చేయడమే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు


Also Read: Watch Video: దటీజ్ మోదీ.. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన భారత ప్రధాని.. నెటిజన్ల ప్రశంసలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 17 Dec 2021 12:09 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.