ట్రెండింగ్ లో ఉన్న వంట పద్ధతి ఏదైనా ఉందంటే అదే ఎయిర్ ఫ్రైయర్. ఎక్కువ మంది ప్రజలు దీనిలో వండేందుకు ఇష్టపడుతున్నారు. ఇందులో వండిన పదార్ధాలు క్రిస్పీగా, రుచికరంగా ఉంటాయి. ఎయిర్ ఫ్రైయర్ కాఫీ మేకర్ పరిమాణంలో ఉండే ఓ కిచెన్ అప్లయెన్స్. ఇందులో చిప్స్, చేపల ఫ్రై, చికెన్ ఫ్రై... ఇలా చాలా వంటలు చేసుకోవచ్చు. 


ఎలా పనిచేస్తుంది?
విద్యుత్ తో నడుస్తుంది ఎయిర్ ఫ్రైయర్. ఇందులో ఆహారాన్ని ఉంచినప్పుడు దాని చుట్టు వేడిగాలి ప్రసరిస్తుంది. ఆ వేడిగాలి దాదాపు 400 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది. ఇది ఆహారాన్ని క్రిస్పీగా, క్రంచీగా మారుస్తుంది. నూనె కూడా అవసరం ఉండదు. వెచ్ నగ్గెట్స్, చికెన్ నగ్గెట్స్, చికెన్ వింగ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, డోనట్స్, ఆనియన్స్ రింగ్స్... ఇలా నూనెలో వేయించే పదార్థాలన్నింటినీ ఎయిర్ ఫ్రైయర్ లో వండుకోవచ్చు. నూనె కూడా బోలెడంత మిగులు. 


మంచిదేనా?
నూనెలో డీప్ ఫ్రైలు చేసి, ఆ నూనెను కూడా ఆహారంతో పాటూ తినే బదులు ఇలా ఎయిర్ ఫ్రైయర్లో వేయించుకోవడం చాలా బెటర్ అంటున్నారు ఆరోగ్యనిపుణులు. నూనెలో వేయించడం కన్నా గాలిలో వేయించడం బెటరే కదా. ఈ వంట పద్దతి 70 నుంచి 80 శాతం కేలరీలను తగ్గిస్తుంది. పోషకాలు బయటికి పోకుండా నిలుపుతూనే, తక్కువ కొవ్వును కలిగి ఉంటాయి ఈ వంటకాలు. 


ఇవి వండితే ప్రాణాంతకం
ఇందులో కూడా నూనె వేసి వండి వాళ్లు ఉంటారు. అది ఒక్కోసారి ప్రాణాంతకంగా మారొచ్చు. అలాగే కొన్ని పరిశోధనల ప్రకారం ఎయిర్ ఫ్రైయర్లో చేపలను వండకూడదు. 


Note: ఇది ABP Desam ఒరిజనల్ కంటెంట్. copy కొడితే చర్యలు తీసుకుంటాం.


గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.  


Read also: 2022లో ‘సెక్స్ కాఫీ’దే హవా? మూడ్‌ను రొమాంటిక్‌గా మార్చే ఈ కాఫీ కథేంటీ?


Read also: పొట్ట దగ్గరి కొవ్వు తగ్గాలా? రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తినండి


Read also: షాకింగ్.. ఆలూ చిప్స్ ప్యాకెట్లకు ప్యాకెట్లు లాగిస్తున్నారా? ఈ రోగాలకు వెల్‌కమ్ చెప్పినట్లే.. హార్వర్డ్ అధ్యయనం


Read also: ఈ ఏడాది మనదేశంలో ఎక్కువ మంది వెతికిన టాప్ 10 రెసిపీలు ఇవే



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి