AP Rain Updates: బంగాళాఖాతం తీరం వీస్తున్న బలమైన గాలుల ప్రభావం దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలపై ఉంటుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో మరో 24 గంటలు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది. 


ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలలో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలలో నిన్న వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ నేడు వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు సంభవించినప్పుడు చెట్ల కిందకు వెళ్లి తలదాచుకోకూడదని ప్రజలను హెచ్చరించారు.


దక్షిణ కోస్తాంధ్రంలో మరో 24 గంటల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఒకట్రెండు చోట్ల బలమైన గాలులు వీచి, చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు రోజుల తరువాత వాతావరణం పొడిగా ఉండనుంది. మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చునని సూచించారు. నెల్లూరు లాంటి ప్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి జల్లులు కురవనున్నాయి. రాయలసీమలో వాతావరణం పొడిగా ఉంటుంది. కొన్ని చోట్ల మాత్రం తేలికపాటి జల్లులు కురవనుండగా.. ఒకట్రెండు ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడనుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల నుంచి రాయలసీమ ప్రజలు ఇప్పుడే తేరుకుంటున్నారు.
Also Read: Gold-Silver Price: పసిడి ప్రియులకు షాక్, ఏకంగా 300 పెరిగిన బంగారం ధర.. 500 ఎగబాకిన వెండి






తెలంగాణ వెదర్ అప్‌డేట్..
చలిగాలుల ప్రభావంతో తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుందని అధికారులు వెల్లడించారు. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదు కానున్నాయి. రేపటి నుంచి మరో మూడు రోజులు వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపారు. ఒమిక్రాన్ కేసులు వ్యాప్తి చెందుతున్నందున కొవిడ్19 నిబంధనలు తప్పనిసరి పాటించాలని ప్రజలకు సూచించారు.
Also Read: Banyan Tree: ప్రాణవాయువు నిచ్చే వృక్షానికే.. పునర్జన్మ నిచ్చాడు.. కానీ చెట్టుకు ఇంకా సాయం కావాలి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి