మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ అనంతపురం తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం నేతలు తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో మహిళా విభాగం నేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇతర మంత్రులపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అనంతపురం నాల్గవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



దర్యాప్తులో భాగంగా మహిళా నేతలను పోలీసు స్టేషన్ కు పిలిపించి విచారణ చేపట్టారు. అంతటితో ఆగకుండా మహిళా నేతలు చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఎవరెవరు ఉన్నారన్న దానిపై ప్రశ్నించారు. పీఎస్‌కు వచ్చిన మహిళా నేతలు ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని పోలీసులు మహిళా నేతల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు. ఇక్కడే పోలీసులు ప్రవర్తించిన తీరు కొంత వివాదాస్పదమైంది. ఇళ్లలోకి వెల్లిన పోలీసులు ఇంటిని మొత్తం తనిఖీ చేయడం, అంతటితో ఆగకుండా ఇళ్లును క్షుణ్ణంగా వెతికారు. ఇంటిలో దొరికిన డబ్బులు, బ్యాంక్ పాస్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పోలీసులు ప్రవర్తనపై మహిళా నేతలతో పాటు టీడీపీ నేతలు కూడా చాలా సీరియస్ గానే స్పందించారు. ఆరోజే పోలీసుల ప్రవర్తనపై టీడీపీ సీనియర్ నేత, ఎంఎల్ఏ పయ్యావుల కేశవ్ పోలీసుల వ్యవహార శైలిపై కచ్చితంగా కోర్టును ఆశ్రయిస్తామని భాదితులకు అండగా ఉంటామని ప్రకటించారు. 
ఆ పార్టీ నేతలు కోర్టును ఆశ్రయించారు. మహిళా నేతలకు హైకోర్టు బెయిల్ కూడా ఇచ్చింది. పోలీసులు ప్రవర్తించిన తీరుపై అడ్వకేట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో హైకోర్టు అనంతపురం ఎస్పీతో పాటు, నాల్గవ పట్టణ సీఐని కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఈ నెల 21న కోర్టుకు హాజరు కావాలంటూ ఆదేశించింది. దీంతో పోలీసులు ప్రవర్తనపై మరోసారి చర్చకు దారితీసింది. మహిళా నేతలు ఆరోపణలు చేస్తే కేసు నమోదు చేసి విచారణ చేయాలి కానీ, ఇళ్లలోకి వెళ్లి వ్యక్తిగతంగా దాడులు చేయడం ఏంటని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. 


మేం ఆరోపణలు చేస్తే కేసులు నమోదు చేసే పోలీసులు మంత్రులపై ఎందుకు కేసులు నమోదు చేయలేదంటూ ప్రశ్నిస్తున్నారు. అత్యుత్సాహంతోనే పోలీసులు తమ ఇళ్లపై దాడి చేసి, వంటిళ్లుతో సహా క్షుణ్ణంగా తనిఖీలు చేసి తమను ఇబ్బందులకు గురిచేశారని పిర్యాదు చేసినట్లు తెలిసింది. వీటన్నిటిపై కూడా టీడీపీ నేతలు సీరియస్ గానే రియాక్ట్ అవుతున్నారు. తమ కార్యకర్తలపై ఎవ్వరూ దాడిచేసినా చూస్తూ ఉరుకోనేది లేదంటున్నారు. మహిళా విభాగం నేతలపై పోలీసులు కేసు నమోదు చేయడం, వారి వెనుక ఎవరున్నారన్న దాని పేరుతో వేదించారంటూ మహిళా నేతలు ఆరోపిస్తున్నారు. 
Also Read: తిరుపతిలో జరగబోయేది తెలుగుదేశం పార్టీ సభ.... ప్రాజెక్టులకు భూములిచ్చిన రైతులది త్యాగం కాదా?... టీడీపీపై మంత్రి బొత్స ఫైర్
జరిగిన పరిణామాలకు సమాధానం చెప్పాలంటూ హైకోర్టు ఎస్పీని పిలిపించడం జిల్లాలో చర్చనీయాంశం అయ్యింది. మరి పోలీసులు ఏం చెప్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది. వీటికి తోడు ఇటీవలే రాయదుర్గం పోలీసులు మాజీమంత్రి కాలువ శ్రీనివాసులు, మరో పదమూడు మందిపై పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేసిన కేసులో రాయదుర్గం పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఈ కేసుపై కూడా టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లనున్నారు. పోలీసులు వర్సెస్ టీడీపీ నేతలు అన్నట్లుగా ఉన్న ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందోనని ఉత్కంఠ నెలకొంది.
Also Read: AP Employees : పీఆర్సీ కూడా ప్రకటించలేదు ... ఉద్యమం నిలిపివేత ! ఏపీ ఉద్యోగ నేతలు ఏం సాధించారు ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి