రోజువారీ కూలీ కోసం హైదరాబాద్‌కు వలస వచ్చిన ఓ వ్యక్తిపై ఓ రెస్టారెంట్ సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారు. అతను దొంగ అని పొరబడడం వల్ల తీరని నష్టం కలిగింది. ఆకలితో అలమటిస్తున్న ఓ వ్యక్తిపై మూకుమ్మడి దాడి చేయడంతో ఆ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన రాజేష్‌ అనే 32 ఏళ్ల వ్యక్తి, భార్యా, పిల్లలతో కలిసి మాదాపూర్‌ సమీపంలోని ఓ బస్తీలో ఉంటున్నాడు. ఇతను బాచుపల్లిలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో కార్మికుడిగా పని చేస్తున్నాడు.


Also Read: Minister Harish Rao: నిమ్స్ లో రికార్డు స్థాయిలో కిడ్నీ శస్త్ర చికిత్సలు... వైద్య సిబ్బందికి మంత్రి హరీశ్ రావు కితాబు


ఇతను బుధవారం రాత్రి పని ముగించుకొని ఇంటికి వచ్చే సమయంలో జేఎన్‌టీయూహెచ్‌ మెట్రో స్టేషన్‌ పక్కనే ఉన్న మొఘల్స్‌ ప్యారడైజ్‌ రెస్టారెంట్‌ సెల్లర్‌లోకి వెళ్లాడు. అప్పటికే అక్కడ రెస్టారెంట్‌ మేనేజర్‌ పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండడంతో ఇతను కూడా వెళ్లాడు. అక్కడ సిబ్బంది కలిసి పార్టీ చేసుకుంటున్నారు. వాళ్లు తినగా మిగిలింది తనకు ఇవ్వాలంటూ రాజేశ్‌ వాళ్లను వేడుకున్నాడు. కానీ, మానవత్వం మరిచిపోయారు. అతను దొంగగా భావించి అందరూ మూకుమ్మడి దాడి చేశారు. అంతా చితకబాది వెళ్లిపోయారు.


Also Read: అమెజాన్‌కు నెట్‌ఫ్లిక్స్ భారీ షాక్.. ధరలు 60 శాతం వరకు తగ్గింపు.. ఏ స్ట్రీమింగ్ సర్వీస్ ప్లాన్లు బెస్ట్?


రాత్రంతా అక్కడే స్పృహలో లేకుండా పడిపోయి ఉన్న రాజేష్‌ను.. గురువారం ఉదయం హోటల్‌ సిబ్బంది గుర్తించారు. ఒడిషాలోని రాజేష్‌ తండ్రికి సమచారమివ్వగా అతను భార్య సత్యభామకు తెలుపడంతో ఆమె వెళ్లి ఇంటికి తీసుకొచ్చింది. ఇంటికి వెళ్లిన కాసేపటికే రాజేష్‌ చనిపోయాడు. సత్యభామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని హోటల్‌ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. రాజేష్‌కు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు.


Also Read: Omicron: తెలంగాణలో కొత్తగా 4 ఒమిక్రాన్‌ కేసులు... 7కు చేరిన మొత్తం కేసులు


Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!


Also Read: Minister KTR: వరంగల్ కు జెన్పాక్ట్ ఐటీ కంపెనీ... మంత్రి కేటీఆర్ తో జెన్పాక్ట్ బృందం భేటీ...


Also Read:  కొత్త కారు కొనాలనుకుంటున్నారా.. ఈ బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లపై ఓ లుక్కేయండి!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి