వరంగల్ నగరానికి అంతర్జాతీయ ఐటీ కంపెనీ జెన్పాక్ట్ రానుంది. జెన్పాక్ట్ ప్రతినిధుల బృందం గురువారం మంత్రి కేటీఆర్ తో ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి కేటీఆర్ తో జెన్పాక్ట్ సీఈవో మాట్లాడారు. వరంగల్ లో జెన్పాక్ట్ సంస్థ ఏర్పాటుచేయాలని మంత్రి కేటీఆర్ కోరారు. వరంగల్ లో ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటికే వరంగల్ లో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఈ ప్రాంతంలో మానవ వనరుల వల్ల అనేక ఐటీ సంస్థలు  ముందుకు వస్తున్నాయన్నారు. వరంగల్ లాంటి నగరాల్లో తమ పరిశ్రమలను విస్తరించేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. వరంగల్ హైదరాబాద్ మధ్య కనెక్టివిటీ ఉందని, ఉత్తమ విద్యాసంస్థలు వరంగల్ లో ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. జెన్పాక్ట్ సీఈవో టైగర్ త్యాగరాజన్, కంపెనీ ప్రతినిధి బృందానికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. 






Also Read: సీఎం జగన్ తో ఫ్లిప్ కార్ట్ సీఈవో భేటీ... విశాఖలో పెట్టుబడులు పెట్టాలని కోరిన సీఎం


ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ టవర్లు


ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం ఖమ్మం, కరీంనగర్, వరంగల్ ఎల్-1, ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ టవర్లను ఏర్పాటు చేసిందని, అక్కడ వివిధ కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. త్వరలోనే మహబూబ్ నగర్, నిజామాబాద్, సిద్ది పేటలలో ఐటీ టవర్ ల పనులు పూర్తి కానున్నాయన్నారు. వరంగల్ లో టెక్ మహీంద్రా, మైండ్ట్రీ, సయంట్ వంటి కంపెనీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. 


Also Read: అమెజాన్‌కు నెట్‌ఫ్లిక్స్ భారీ షాక్.. ధరలు 60 శాతం వరకు తగ్గింపు.. ఏ స్ట్రీమింగ్ సర్వీస్ ప్లాన్లు బెస్ట్?





టెక్ సెంటర్ గా వరంగల్ 




ఇప్పటికే తమ కంపెనీ హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుందని, పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్న పోచారం క్యాంపస్ కి కేవలం గంటన్నర దూరంలోని వరంగల్ క్యాంపస్ రానున్నదని కంపెనీ సీఈవో టైగర్ త్యాగరాజన్ తెలిపారు. తమ కంపెనీ ప్రతినిధి బృందం వరంగల్ ఐటీ పరిశ్రమకు అనుకూలంగా ఉన్న ఎన్ఐటి వంటి విద్యా సంస్థలతో పాటు అనేక ఇంజినీరింగ్ కాలేజీలను పరిగణనలోకి తీసుకుందన్నారు. వరంగల్ నగరంలోనూ అపారమైన, నాణ్యమైన మానవ వనరులు ఉన్నాయని ఆయన తెలిపారు. తమ కంపెనీకి భవిష్యత్తులో వరంగల్ నగరం ఒక కీలకమైన టెక్ సెంటర్ గా మారనుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కంపెనీకి వివిధ దేశాల్లో సుమారు లక్ష మందికి పైగా ఉద్యోగులు ఉన్నట్లు తెలిపారు. 


Also Read:  కొత్త కారు కొనాలనుకుంటున్నారా.. ఈ బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లపై ఓ లుక్కేయండి!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి