UP Election 2021: 'యూపీ ఎలక్షన్లు 2024 సాధారణ ఎన్నికలకు సెమీస్ కావు'

ABP Desam   |  Murali Krishna   |  19 Dec 2021 07:18 PM (IST)

ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచిన ఆ ప్రభావం 2024 పార్లమెంటు ఎన్నికలపై ఉండదన్నారు.

యూపీ ఎన్నికలు సెమీఫైనల్స్ కావు: ప్రశాంత్ కిషోర్

ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారం మొదలుపెట్టాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలచి కేంద్రంలో అధికారం చేపట్టాలంటే యూపీ అసెంబ్లీ ఎన్నికలు చాలా కీలకం. అందుకే పార్టీలన్నీ యూపీ ఎన్నికలపై దృష్టి పెట్టాయి. అయితే యూపీ ఎన్నికల ఫలితాల ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై ప్రత్యక్షంగా ఏ మాత్రం ఉండదని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. 

2012లో జరిగిన ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 4వ స్థానంలో నిలిచింది. సమాజ్‌వాదీ పార్టీ ఆ ఎన్నికల్లో గెలుపొంది యూపీలో అధికారం చేపట్టింది. కానీ ఆ ప్రభావం 2014లో జరిగిన సాధారణ ఎన్నికలపై ఏ మాత్రం లేదు. 2022లో జరగనున్న ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024లో రానున్న లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ ఏం కావు. 2024 కంటే ముందే చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి.                                              - ప్రశాంత్ కిషోర్, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త

ప్రశాంత్ కిషోర్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్‌లో చేరి రాజకీయం చేస్తారని ఇటీవల వార్తలు వినిపించినప్పటికీ హస్తం పార్టీపై ఆయన తరచుగా విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన ట్వీట్లు రాజకీయ దుమారం రేపాయి. అయితే బంగాల్ సీఎం మమతా బెనర్జీతో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసే యోచనలో ప్రశాంత్ కిషోర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన చేసిన కామెంట్లు కూడా ఇందుకు సంకేతాలిస్తున్నాయి.

ఇటీవల గోవాలో ఓ రాజకీయ పరమైన చర్చాగోష్టి జరిగింది. దీనికి ప్రశాంత్ కిషోర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తన అభిప్రాయాలను వెల్లడించారు. బీజేపీ గెలిచినా ఓడినా వచ్చే మూడు, నాలుగు దశాబ్దాల పాటు భారత రాజకీయాల్లో ఆ పార్టీది కీలక పాత్రని విశ్లేషించారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తించడం లేదన్నారు. బీజేపీ ప్రస్థానాన్ని కాంగ్రెస్ పార్టీతో పోల్చారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా స్వాతంత్యం వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు  భారత రాజకీయాల్లో  కాంగ్రెస్‌ ఎలా స్ట్రాంగ్‌గా ఉందో..  వచ్చే 30, 40 ఏళ్లు  బీజేపీ అలాగే ఉండబోతోందని స్పష్టం చేశారు.

భాజపా ప్లాన్..

ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల కోసం దాదాపు 150 మంది సీనియర్ నేతలను రంగంలోకి దింపింది భాజపా. అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకు వీరు రెండు రాష్ట్రాల్లోనే ఉండనున్నారు. 

పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లోని 44 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జిల్లాల వారీ ఇంఛార్జ్‌లుగా 100 మంది సీనియర్ నేతలను నియమించింది భాజపా అధిష్టానం. బూత్ మేనేజ్‌మెంట్ సహా ప్రచారంపై వీరు నిమగ్నం కానున్నారు.

Also Read: 144 in Kerala: కేరళ అలప్పుజలో 144 సెక్షన్.. గంటల వ్యవధిలో ఇద్దరు రాజకీయ నేతల హత్య

Also Read: Covid-19 Vaccination: ఆదర్శంగా అండమాన్ నికోబార్ దీవులు.. సవాళ్లను దాటి 100% వ్యాక్సినేషన్

Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 7,081 మందికి కరోనా.. 143కు చేరిన ఒమిక్రాన్ కేసులు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 19 Dec 2021 07:16 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.