కేరళ అలప్పుజలో హై టెన్షన్ నెలకొంది. 10 గంటల వ్యవధిలో ఇద్దరు రాజకీయ నేతలు హత్యకు గురికావడంతో ఆ ప్రాంతమంతా భయాందోళనలు నెలకొన్నాయి. ఎస్‌డీపీఐ నేత కేఎస్ షా, భాజపా నేత రంజిత్ శ్రీనివాసన్ ఇద్దరు హత్యకు గురయ్యారు. దీంతో అలప్పుజలో 144 సెక్షన్ అమలు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఏ అలెగ్జాండర్ తెలిపారు.
ఈ రాజకీయ హత్యలను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఖండించారు. ఈ మేరకు సీఎంఓ ప్రకటన విడుదల చేసింది.
10 గంటల్లో..
శ్రీనివాసన్ (40) ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా, భాజపా రాష్ట్ర కమటీ సభ్యుడిగా ఉన్నారు. శ్రీనివాసన్‌ను ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంట్లోనే ఉరితీసి చంపేశారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో అలప్పుజ నియోజకవర్గంలో భాజపా తరఫున శ్రీనివాసన్ పోటీ చేశారు. ఆయన వృత్తిరీత్యా న్యాయవాదిగా ఉన్నారు.
మరో ఘటనలో సోషల్ డెమోక్రెటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) నేత కేఎస్ ఖాన్ తన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఓ కారుతో ఢీ కొట్టి చంపేశారు. గుర్తుతెలియని మూక ఆయనపై దాడి చేసినట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన వెంటనే ఖాన్‌ను ఎర్నాకులంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ తీవ్ర గాయాలు కావడంతో ఆయన మృతి చెందారు. ఆయన హత్యలో ఆర్‌ఎస్‌ఎస్ పాత్ర ఉన్నట్లు ఎస్‌డీపీఐ ఆరోపించింది.
144 సెక్షన్..
Also Read: Marriage: పెళ్లిలో రూ.10 లక్షలు డిమాండ్ చేసిన వరుడు.. వీపు విమానం మోత మోగించిన వధువు కుటుంబం
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 7,081 మందికి కరోనా.. 143కు చేరిన ఒమిక్రాన్ కేసులు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి