వ్యాక్సినేషన్‌లో అండమాన్ అండ్ నికోబార్ దీవులు అరుదైన మైలురాయిని చేరుకున్నాయి. అర్హులైన వారందరికీ రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసి రికార్డ్ సృష్టించింది. ఈ మేరకు అక్కడి పాలకవర్గం ట్వీట్ చేసింది. కేవలం కొవిషీల్డ్ వ్యాక్సిన్‌తోనే ఈ ఘనత అందుకోవడం విశేషం.
తొలిరోజు నుంచే..
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైన జనవరి 16నే ఈ దీవుల్లోనూ టీకాలు ఇవ్వడం మొదలుపెట్టారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం అండమాన్ నికోబార్ దీవుల్లో మొత్తం 2.87 లక్షల మంది అర్హులు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ దీవుల్లో మొత్తం జనాభాలో 74.67 శాతం మందికి టీకాలు అందాయి.
కేసులు..
అండమాన్ నికోబార్ దీవుల్లో ఆదివారం మరో కరోనా కేసు నమోదు కాగా.. మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 7,701కి పెరిగింది. వీరిలో 129 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రెండు యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Also Read: 144 in Kerala: కేరళ అలప్పుజలో 144 సెక్షన్.. గంటల వ్యవధిలో ఇద్దరు రాజకీయ నేతల హత్య
Also Read: Marriage: పెళ్లిలో రూ.10 లక్షలు డిమాండ్ చేసిన వరుడు.. వీపు విమానం మోత మోగించిన వధువు కుటుంబం
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 7,081 మందికి కరోనా.. 143కు చేరిన ఒమిక్రాన్ కేసులు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి