సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ క్లబ్‌లో మంటలు రాజుకున్నాయి. వెంటనే మంటలు క్లబ్ మొత్తం వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. 10 అగ్నిమాపక యంత్రాలను మోహరింపజేసి మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి మంటలను అదుపు చేశారు. మంటలను అదుపు చేసేందుకు సుమారు 4 గంటల సమయం పట్టింది. క్లబ్‌లో సంభవించిన అగ్ని ప్రమాదం వల్ల సుమారు రూ.20 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ అగ్ని ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read: నరక ద్వారం.. 50 ఏళ్లుగా ఇక్కడి భూమి మండుతూనే ఉంది.. చిన్న తప్పు ఎంత పనిచేసింది!
ఈ క్లబ్‌కు జూబ్లీ బస్ స్టేషన్ దగ్గరలోనే ఉండటంతో అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ వైపుగా ఉండే వాహనాల రాకపోకలపై పోలీసులు నిషేధం విధించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Also Read: ఈ చేప భలే డ్రైవింగ్ చేస్తోంది.. ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ కేసు పెట్టరు కదా?
పురాతనమైందిగా గుర్తింపు
అయితే, 1879లో బ్రిటీష్ హయాంలో మిలిటరీ అధికారుల కోసం ఈ క్లబ్ నిర్మాణం చేశారు. దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో సికింద్రాబాద్ క్లబ్ నిర్మాణం జరిగింది. భారతీయ వారసత్వ సంపదగా 2017లో గుర్తించి పోస్టల్ కవర్ కూడా కేంద్రం విడుదల చేసింది. సికింద్రాబాద్ క్లబ్‌లో ప్రస్తుతం మొత్తం 300 మంది సిబ్బంది పని చేస్తున్నారు. అంతేకాకుండా సికింద్రాబాద్ క్లబ్‌లో 5 వేల మందికి పైగా సభ్యత్వం ఉంది.
Also Read: ఓమిక్రాన్ తర్వాత వరుసగా మరిన్ని వేరియంట్లు, వాటి తీవ్రత ఎంతంటే.. తాజా పరిశోధన వెల్లడి
సికింద్రాబాద్ క్లబ్‌లో అగ్నిప్రమాదంపై మాజీ ఆర్మీ అధికారి విజయ్ స్పందించారు. అగ్నిప్రమాదంలో సికింద్రాబాద్ క్లబ్ మెయిన్ హాల్ పూర్తిగా కాలిపోయిందన్నారు. సికింద్రాబాద్ క్లబ్ తనకు ఇల్లు లాంటిదని తెలిపారు. మూడు తరాలుగా తమకు సికింద్రాబాద్ క్లబ్‌లో మెంబెర్ షిప్ ఉందని చెప్పారు. మెయిన్ హాల్ పూర్తిగా దగ్ధం అయ్యిందని విజయ్ వెల్లడించారు.
Also Read: Secunderabad Fire: సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. రూ.కోట్లలో ఆస్తి నష్టం
Also Read: సముద్ర గర్భంలో బద్దలైన అగ్నిపర్వతం.. ముంచెత్తిన సునామీ.. శాటిలైట్ వీడియో వైరల్
Also Read: వామ్మో.. ఇలా ఉందేంటి? అమెరికన్లను వణికిస్తున్న ‘ఐస్ డిస్క్’..
Also Read: తత్కాల్‌లో రైల్వే టికెట్స్ వేగంగా బుక్ చేయాలా? ఇదిగో ఇలా చేయండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి