గ్నిపర్వతాలు ఎప్పుడు ఎలా పేలుతాయో తెలీదు. కొన్ని వందల ఏళ్లు.. నిశబ్దంగా ఉండే పర్వతాల్లో ఒక్కోసారి అకస్మాత్తుగా ఉనికిలోకి వస్తాయి. సమీప ప్రాంతాల్లో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తాయి. అవిగానీ పేలితే భారీ విధ్వంసం తప్పదు. నిప్పులు కక్కే లావా ఆ ప్రాంతమంతా విస్తరిస్తుంది. అయితే, ఇప్పటివరకు మనం భూమిపై ఎగసిపడే అగ్నిపర్వతాలను మాత్రమే చూశాం. ఇదే విధ్వంసం సముద్ర గర్భంలో చోటుచేసుకుంటే ఎలా ఉంటుందో చూడలేదు. తాజాగా పసిఫిక్ మహా సముద్రంలోని తోంగా దీవుల సమీపంలో సముద్ర గర్భంలో ఉన్న అగ్నిపర్వతం పేలింది. 


సముద్రంలో చిన్న అలజడి ఏర్పడినా ప్రమాదమే. అలాంటిది శనివారం సముద్ర గర్భంలో అగ్నిపర్వతం పేలింది. ఇంకేముంది.. ఆ అగ్నిపర్వతానికి సమీపంలో ఉన్న తొంగాపై సునామీ విరుచుకుపడింది. ఆ దేశ రాజధాని నగరం.. నుకుఅలోఫా(Nuku'alofa)లో భారీ ఎత్తున అలలు ఎగిసిపడ్డాయి. స్థానిక చర్చితోపాటు.. కొన్ని ఇళ్లు నీటిలో చిక్కుకున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


‘హుంగా టోంగా-హంగా హావుపై’ (Hunga Tonga-Hunga Haʻapai) అనే అగ్నిపర్వతం సముద్ర గర్భంలో ఉండటం వల్ల దాని ఉనికిని కనిపెట్టలేకపోయారు. ఆ దేశపు ప్రధాన దీవి తోంగతాపులోని నుకుఅలోఫాకు కేవలం 65 కిమీల దూరంలోనే ఉంది. దీంతో అగ్నిపర్వతం పేలుడుకు సముద్రపు నీరు అలజడికి గురై.. ఆ నగరాన్ని ముంచెత్తాయి. ఆ భారీ శబ్దాన్ని విని అంతా.. స్థానిక ప్రజలు బాంబు పేలుడని భావించారు. సునామీ హెచ్చరికలు రాగానే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరుగులు తీశారు.


Also Read: రాత్రికి రాత్రి వింతగా మారిపోయిన ఇసుక.. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? ఫొటోలు వైరల్


అగ్నిపర్వతం పేలిన తర్వాత భారీ ఎత్తున దుమ్మూ, దూళి గాల్లోకి లేచాయి. రాళ్లు ఎగిరి నగరంలో పడ్డాయి. పలు చోట్ల విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది. బూడిద మొత్తం సమీప దీవులను మేఘాల్లా కమ్మేసింది. ఆ పేలుడు శబ్దం.. 2 వేల కిమీల దూరంలో ఉన్న న్యూజిలాండ్‌ ప్రజలకు సైతం వినిపించిందంటే.. అది ఏ స్థాయిలో బద్దలైందో అర్థం చేసుకోవచ్చు. అగ్నిపర్వతం విస్పోటనం తర్వాత అమెరికాకు చెందిన సమోవా దీవికి కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తొంగా జియోలాజికల్ సర్వీస్ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 8 నిమిషాలపాటు పేలుళ్లు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పడిన బూడిద, గ్యాస్.. సుమారు 20 కిమీలు విస్తరించింది. ఈ దృశ్యాలు శాటిలైట్‌(ఉపగ్రహం)లో కూడా స్పష్టంగా రికార్డయ్యాయి. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 


అగ్నిపర్వత విస్ఫోటనం, సునామీ వీడియోలను ఈ కింది ట్వీట్లో చూడండి: 


























Also Read: వామ్మో.. ఇలా ఉందేంటి? అమెరికన్లను వణికిస్తున్న ‘ఐస్ డిస్క్’..


Also Read: ఓర్నీ.. చేప వీర్యంతో స్పెషల్ కర్రీ.. అంత కరువేంది బ్రో!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి