అక్కడ ఏం జరిగిందో ఏమో.. రాత్రికి రాత్రికి రాత్రి ఓ సరస్సులోని ఇసుక చిత్రవిచిత్ర ఆకారాల్లోకి మారిపోయింది. ఉదయాన్నే ఆ ప్రాంతానికి వెళ్లినవారు.. అక్కడ ఏం జరిగిందో తెలియక జుట్టు పీక్కున్నారు. ఎప్పుడూ.. వాక్ చేసే ఇసుక ఇప్పుడు ఇలాగైపోయిందేమిటని ఆశ్చర్యపోయారు. అమెరికాలోని మిచిగాన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రకృతి ఒక్కోసారి చాలా చిత్రవిచిత్రాలను చేస్తూ ఉంటుంది. అందులో ఇది కూడా ఒకటి. రాత్రికి రాత్రి ఇసుకను రకరకాల ఆకృతిలోకి మార్చినది ప్రకృతే. ఆ రోజు రాత్రి మిచిగాన్ లేక్ మీదుగా వీచిన బలమైన గాలుల వల్ల ఇసుక అలా మారిపోయింది. కానీ, గాలి వీస్తే ఇసుక ఎగిరిపోవాలేగానీ.. అలా ఆకృతుల్లోకి మారిపోవడం ఏమిటనేగా మీ సందేహం. ఔను, మీరు అనుకుంటుంది కూడా నిజమే. అయితే, పొడి ఇసుక గాల్లో కలిసిపోయే అవకాశం ఉంటుంది. కానీ, ఆ సరస్సు వద్ద ఉన్న ఆ ఇసుక గడ్డ కట్టేసి ఉంది. గాలులు గడ్డకట్టిన ఇసుక సందుల్లోని వేగంగా ప్రయాణించడం వల్ల వివిధ రకాల ఆకృతులుగా మారిపోయాయి. దూరం నుంచి చూస్తే.. అవి చెస్ బోర్డు మీద ఉన్న పాచికల్లా కనిపిస్తున్నాయి. కొందరైతే గాలుల వల్ల అలా జరగలేదని, గ్రహాంతరవాసులే ఇందుకు కారణమని అంటున్నారు. ఏది ఏమైనా ప్రకృతి చెక్కిన ఈ ఇసుక శిల్పాలను చూస్తే మీరు తప్పకుండా ఫిదా అయిపోతారు.
Also Read: వామ్మో.. ఇలా ఉందేంటి? అమెరికన్లను వణికిస్తున్న ‘ఐస్ డిస్క్’.. రెండేళ్ల తర్వాత మళ్లీ ప్రత్యక్షం
Also Read: ఓర్నీ.. చేప వీర్యంతో స్పెషల్ కర్రీ.. అంత కరువేంది బ్రో!
Also Read: ఈ చేప భలే డ్రైవింగ్ చేస్తోంది.. ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ కేసు పెట్టరు కదా?
Also Read: తత్కాల్‌లో రైల్వే టికెట్స్ వేగంగా బుక్ చేయాలా? ఇదిగో ఇలా చేయండి
Also Read: నరక ద్వారం.. 50 ఏళ్లుగా ఇక్కడి భూమి మండుతూనే ఉంది.. చిన్న తప్పు ఎంత పనిచేసింది!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి