Raghurama: జార్ఖండ్ వ్యక్తులతో నన్ను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోంది.. ఆయనకు నచ్చకుంటే తీసేస్తారు

వైసీపీ రెబల్ ఎంపీ రఘరామకృష్ణరాజు సంచలన కామెంట్స్ చేశారు. తన హత్యకు కుట్ర జరుగుతుందని పేర్కొ్న్నారు.

Continues below advertisement

తనను హత్య చేసేందుకు జార్ఖండ్ కు చెందిన వ్యక్తులతో కుట్ర చేస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంపై ప్రధాని మోడీకి లేఖ రాస్తానని చెప్పారు. గుంటూరు జిల్లాలో టీడీపీ నేతను హత్య చేశారని.. ముఖ్యమంత్రి జగన్ కు రాష్ట్రంలోని వ్యవస్థ నచ్చకుంటే వ్యవస్థను.., వ్కక్తి నచ్చకపోయినా వ్యక్తిని తీసేస్తారని ఆరోపించారు. ఏపీ సీఐడీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌పై  తాను ఇచ్చిన ప్రివిలేజ్‌ పిటిషన్ పై వెంటనే స్పందించాలన్నారు. త్వరగా స్పందించాలని.. స్పీకర్‌కు విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు.

Continues below advertisement

జగనన్న గోరుముద్ద పథకంపై కేంద్ర మంత్రికి లేఖ రాశానని.. ఇకపై ఆ పథకంపై రాష్ట్రంలో కొనసాగదన్నారు. దీనిపై కేంద్రమంత్రి స్పందించారన్నారు. కేంద్రం నిధులతో రాష్ట్రంలో జగనన్న పథకాలు కొనసాగించడమేంటని ప్రశ్నించారు. పోలీసులను ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టేందుకు, వేధించేందుకే ఉపయోగిస్తున్నారని రఘురమ ఆరోపించారు. చిరంజీవిని అల్లరి చేసేందుకు రాజ్యసభ అవకాశం అని.. కావాలనే ఓ పత్రికలో వార్తలు రాయించారన్నారు. పవన్‌.. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే పని  చిరంజీవి చెయ్యరన్నారు. ప్రభుత్వంపై పోరాడుతున్న పవన్‌ కల్యాణ్ కు చిరంజీవి మద్దతు ఇవ్వాలని రఘురామ అన్నారు. సినిమా రంగానికి అన్యాయం చేస్తే.. న్యాయం చేసేందుకు కోర్టులు ఉన్నాయన్నారు.

నర్సాపురం టూర్ క్యాన్సిల్

ఎంపీ రఘురామకృష్ణరాజు సంక్రాంతి పండుగను సొంత ఊరిలో చేసుకోవాలన్న ఆలోచన విరమించుకున్నారు. సీఐడీ పోలీసులు హైదరాబాద్ ఇంట్లో విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడంతో తనను అరెస్ట్ చేసే వ్యూహంతోనే ఇలా చేస్తున్నారని రఘురామ అనుమానించారు. మొదట ఆయనకు పదమూడో తేదీనే విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. రఘురామ నిరాకరించడంతో మళ్లీ పదిహేడో తేదీన విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు.

ప్రతి ఏడాది రఘురామకృష్ణరాజు సొంత ఊరు భీమవరంలో  సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. సంప్రదాయ కోడి పందేల్లో పాల్గొంటారు. అనారోగ్యం కారణంగా కొంత కాలం.. ఆ తర్వాత  వైఎస్ఆర్‌సీపీ పార్టీతో విభేదాల కారణంగా మరికొంత కాలంగా ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. రెండేళ్లుగా ఆయన నర్సాపురంలో అడుగుపెట్టలేదు. ఈ మధ్య కాలంలో  ఒకటి, రెండు సార్లు ఆయన నర్సాపురం వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నా  .. ఆయన పర్యటనకు ముందే పలు కేసులు నమోదు కావడంతో చివరికి వెనక్కి తగ్గారు. ఆయా కేసుల్లో  హైకోర్టు నుంచి అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు తెచ్చుకున్నా కొత్త కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారేమోనని ఆయన ఆందోళన చెందారు. 
 
Continues below advertisement