మెగాస్టార్ చిరంజీవికి రౌడీ బాయ్, యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ పూర్తి మద్దతు ప్రకటించారు. అసలు ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే... తెలుగు సినిమా పరిశ్రమ సమస్యలను చర్చించడానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చిరు గురువారం సమావేశం అయిన సంగతి తెలిసిందే. వాళ్లిద్దరి భేటీ తర్వాత మీడియాలో చిరంజీవికి రాజ్యసభ సీటును జగన్ ఆఫర్ చేశారనే ప్రచారం జరిగింది.
తనకు రాజ్యసభ సీటు ఆఫర్ చేశారనే ఊహాగానాలకు శుక్రవారం చిరంజీవి ఫుల్ స్టాప్ పెట్టారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న తాను మళ్లీ రాజకీయాల్లోకి, చట్టసభల్లోకి రావడం కుదరదని స్పష్టం చేశారు. అలాగే... 'వార్తలు ఇవ్వండి. మీకు తోచింది (అభిప్రాయాలు) కాదు' (Give News Not Views) హ్యాష్ ట్యాగ్ జోడించారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ "మై ఫుల్ సపోర్ట్" అంటూ ఓ ట్వీట్ చేశారు. చిరు హ్యాష్ ట్యాగ్ (#GiveNewsNotViews) ను ఆయన జోడించారు. గతంలో విజయ్ దేవరకొండ తనపై నిరాధారమైన వార్తలు ప్రసారం చేసిన ఓ వెబ్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు... ఆయనకు చిరంజీవి అండగా నిలిచారు. చిరంజీవి మాత్రమే కాదు... ఇండస్ట్రీలో పలువురు హీరోలు తమ మద్దతు తెలిపారు.
Also Read: వరుణ్ తేజ్ దోసె చూసి కుళ్లుకున్న చిరంజీవి.. ‘మెగా’ ఫ్యామిలీని అలా చూసి ఫ్యాన్స్ ఫిదా!
Also Read: రావణాసుర... ఎంతమంది హీరోయిన్లు ఉన్నారో చూశారా?
Also Read: 'బంగార్రాజు' మూవీ రివ్యూ: నాగ్ vs చైతు.. బంగార్రాజులు అదరగొట్టారా?
Also Read: అయ్యప్ప దీక్షలో అజయ్ దేవగన్.. శబరిమలైలో ప్రత్యక్షమైన RRR స్టార్
Also Read: 'సూపర్ మచ్చి' రివ్యూ: సూపర్ అనేలా ఉందా? లేదా?
Also Read: రౌడీ బాయ్స్ రివ్యూ: యూత్‌ని మెప్పించే రౌడీ బాయ్స్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి