Stock Market Update Telugu: భోగి రోజున భారత స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒడుదొడులకు లోనయ్యాయి. బెంచ్‌మార్క్‌ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఎక్కువగా పతనమైన సూచీలు మధ్యాహ్నం కోలుకున్నాయి. ఐటీ, స్థిరాస్తి, క్యాపిటల్‌ గూడ్స్‌ రంగాల షేర్లు రాణించాయి. ఉదయం ఆసియా మార్కెట్లు, మధ్యాహ్నం ఐరోపా మార్కెట్లు నష్టాల్లోనే మొదలైనా మదుపర్లు ఎక్కువగా విక్రయాలు చేపట్టలేదు.






క్రితం రోజు 61,235 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 61,040 వద్ద గ్యాప్‌డౌన్‌తో మొదలైంది. వెంటనే అమ్మకాలు జోరందుకోవడంతో 60,757 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత క్రమం పుంజుకుంటూ 61,324 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకొంది. చివరికి 12 పాయింట్ల స్వల్ప నష్టంతో 61,223 వద్ద ముగిసింది.


గురువారం 18,257 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 18,185 వద్ద ఆరంభమైంది. వెంటనే 18,119 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. క్రమంగా విక్రయాలు పెరగడంతో 18,286 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 2 పాయింట్ల నష్టంతో 18,255 వద్ద ముగిసింది.


Also Read: Budget 2022: దయ చూపాలమ్మా 'నిర్మలమ్మ'! బడ్జెట్‌కు ముందు వేతన జీవుల వేడుకోలు!!


Also Read: Infosys: మీది గ్రాడ్యుయేషన్ అయిందా? ఇన్ఫోసిస్ సంస్థ గుడ్‌న్యూస్, భారీగా ఉద్యోగాలు


Also Read: Doorstep Banking Services: ఇంటి వద్దకే బ్యాంకు! ఒక్క లావాదేవీకి ఎంత తీసుకుంటారో తెలుసా!


ఇక బ్యాంక్‌ నిఫ్టీ 99 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 38,302 వద్ద మొదలైన సూచీ 38,007 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత పుంజుకొని 38,448 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకొంది. చివరికి 38,370 వద్ద ముగిసింది.


నిఫ్టీలో 20 కంపెనీలు లాభపడగా 30 నష్టపోయాయి. టాటా కన్జూమర్‌ ఏకంగా 4.19 శాతం లాభపడి 760 వద్దకు చేరుకుంది. ఐఓసీ, టీసీఎస్‌, ఇన్ఫీ, అదానీ పోర్ట్స్‌ లాభపడ్డాయి. ఆసియన్‌ పెయింట్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, యూపీఎల్‌, హిందుస్థాన్‌ యునిలివర్‌, ఓఎన్‌జీసీ నష్టపోయాయి. నిఫ్టీ ఐటీ 219 పాయింట్లు పెరగ్గా నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ 271 పాయింట్లు పతనమైంది.