దేశంలోనే రెండో అతి పెద్ద ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ సంస్థ శుభవార్త చెప్పింది. గ్లోబల్ గ్రాడ్యుయేట్ హైరింగ్ ప్రోగ్రాం కింద తాము 2022 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 55 వేల మంది ఫ్రెషర్స్‌ను నియమించుకుంటున్నట్లుగా బుధవారం ప్రకటించింది. ఈ విషయాన్ని ఇన్ఫోసిస్ ముఖ్య ఆర్థిక అధికారి నిలంజన్ రాయ్ ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కంపెనీ రూ.5,809 కోట్ల లాభాలు గడించినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.


నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులు, అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చి అందుకు అనుగుణంగా ఇన్ఫోసిస్ తన పెట్టుబడులను కొనసాగిస్తోందని నిలంజన్ రాయ్ తెలిపారు. అందులో భాగంగానే గ్లోబల్ గ్రాడ్యుయేట్ హైరింగ్ ప్రోగ్రాం కింద దాదాపు 55 వేల మంది ఫ్రెషర్స్‌ను సంస్థలో నియమించుకుంటున్నట్లు వెల్లడించారు. తాజా ప్రకటనతో కొత్తగా డిగ్రీ పూర్తి చేసి బయటికి వచ్చేవారికి, లేదా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త వినిపించినట్లయింది.


గతేడాది డిసెంబరు నాటికి ఇన్ఫోసిస్‌లో మొత్తం ఉద్యోగులు 2,92,067 మంది కాగా.. అంతకుముందు త్రైమాసికంలో 2,79,617 మంది ఉన్నారు. అదే 2020 డిసెంబరులో ఉద్యోగుల సంఖ్య 2,49,312గా ఉంది.


Also Read: Job Skills: కొత్త ఏడాది.. కొత్త స్కిల్స్ నేర్చుకుంటే పోలా.. ఇక 2022 మీదే అవ్వొచ్చు


ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ సలీల్ పరేఖ్ మాట్లాడుతూ.. కంపెనీ ఉద్యోగుల ప్రతిభను ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తామని తెలిపారు. “తాజా ప్రోగ్రాం కింద, మేము వినియోగదారుల ప్రతి అవసరాన్ని తీర్చడానికి పని చేస్తాం. అందుకోసం మా ఉద్యోగులకు మరింత నైపుణ్యం చేకూరేలా దృష్టి పెడతాం. దీంతో పాటు ఉద్యోగుల సంక్షేమం కూడా మా ప్రాధాన్యంలో ఉంటుంది.’’ అని సలీల్ పరేక్ అన్నారు.


డిసెంబర్ 31తో ముగిసిన మూడో త్రైమాసికం ఫలితాలను ఇన్ఫోసిస్ బుధవారం ప్రకటించింది. దాని ఏకీకృత నికర లాభం ఏడాదికి 11.8 శాతం చొప్పున పెరిగి రూ.5,197 కోట్ల నుంచి రూ.5,809 కోట్లకు చేరుకుంది. అంతేకాకుండా, ఇన్ఫోసిస్ సంస్థ తన ఆదాయ వృద్ధి మార్గదర్శకాలను 19.5-20 శాతానికి పెంచింది.


Also Read: HPCL Recruitment 2022: విశాఖపట్నం హెచ్‌పీసీఎల్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 14.. అప్లై చేయండిలా.. 


Also Read: Army Public School Recruitment 2022: ఆర్మీ స్కూల్స్‌లో టీచర్ ఉద్యోగాలు.. 57ఏళ్ల వయసు వాళ్లు అప్లై చేసుకోవచ్చు..


Also Read: సినిమా చూసిన టైంలో పైసా ఖర్చు లేకుండా యానిమేషన్ నేర్చుకోండిలా.. కొత్త సంవత్సరంలో కొత్తగా ట్రై చేయండి..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి