దేశంలో కరోనా తీవ్రస్థాయిలో పెరుగుతోంది. నిన్న సుమారు రెండు లక్షల కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరితో మాట్లాడనున్నారు.
సాయంత్రం నాలుగున్నరకు ఈ వీడియో కాన్ఫరెన్స్ జరగనున్నట్టు తెలుస్తోంది.
ఈ మీటింగ్‌లో ఆయా రాష్ట్రాల్లో కరోనా ఉన్న పరిస్థితి. కట్టడికి తీసుకుంటున్న చర్యలు తెలుసుకోనున్నారు. కేంద్రం తీసుకోబోయే చర్యలను వాళ్లతో చర్చిస్తారు. వైరస్ వ్యాప్తి అరికట్టకేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా అడిగి తెలుసుకోనున్నారు.
ఇరవై నాలుగు గంటల్లో లక్షా తొంభై నాలుగు వేల ఏడువందల ఇరవై కేసులు ఎప్పుడు నమోదయ్యాయో అప్పుడే అన్ని రాష్ట్రాలతో మాట్లాడాలని పీఎంవో నిర్ణయించినట్టు తెలుస్తోంది. అదే టైంలో డెత్ రేట్ కూడా పెరగడంతో ఆందోళన పెరిగింది.
మూడో వేవ్ ముంచుకొచ్చిన టైంలో వివిధ రాష్ట్రాల సీఎంలతో తొలిసారిగా ప్రధాని మాట్లాడనున్నారు. ఒమిక్రాన్ కమ్మేస్తున్న వేళ పరిస్థితి చేయిదాటిపోకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు.
మొదటి, రెండో వేవ్‌లో కూడా చాలా సార్లు ఇలాంటి మీటింగ్స్ పెట్టారు ప్రధాని మోదీ. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సిన్ పంపిణీకి చేపట్టాల్సిన ప్రణాళికలపై చర్చించారు.
ఈ మధ్య కాలంలో చాలా రాష్ట్రల్లో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కట్టడి చర్యలు తీసుకున్నాయి. రాత్రి కర్ఫ్యూ పెట్టాయి. ఇతర ఆంక్షలు కూడా విధించాయి. అయినా వైరస్ ఉదృతి ఇంకా తగ్గలేదు.
అందుకే ఆదివారం కేబినెట్ అత్యవసర సమావేశం నిర్వహించి వైరస్ కట్టడికి తీసుకున్న చర్యలపై చర్చించారు. రాష్ట్రాల సీఎంలతో మాట్లాడాలని అప్పుడే నిర్ణయించారు. వర్చ్యువల్‌గా సీఎంలతో మాట్లాడి వైరస్ వ్యాప్తిని అరికట్టాలని... ఆయా రాష్ట్రాల్లో ఉన్న స్థితిగతులు, పాటిస్తున్న ఉత్తమ పద్ధతులు, ప్రజారోగ్యశాఖ తీసుకుంటున్న చర్యలపై మాట్లాడనున్నారు.
జిల్లా స్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, టీనేజర్స్‌కు ఇస్తున్న వ్యాక్సిన్‌ను మరింత వేగవంతం చేసేలా సీఎంలకు దిశానిర్దేశం చేయనున్నారు.
హోంమంత్రి అమిత్‌షా, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాండవియా సహా ఇతర ఆరోగ్య శాఖాధికారులు కూడా ఈ భేటీలో పాల్గొంటారు.
Also Read: Covid 19 Lockdown: ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ కీలక భేటీ.. లాక్‌డౌన్ విధిస్తారా?