వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నడిచే ఆర్మీ పబ్లిక్‌ స్కూల్స్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. సుమారు తొమ్మిది వేల వరకు ఖాళీలు ఉన్నాయి. 
టీజీటీ, పీజీటీ, పీఆర్టీ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చింది. 
ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ స్వీకరణ జనవరి 7నుంచి స్టార్ట్ అయింది. జనవరి 28వరకు దరఖాస్తులు తీసుకోనుంది. ఫిబ్రవరి 19-20 తేదీల్లో పరీక్ష నిర్వహించనుంది. హాల్‌టికెట్లను ఫిబ్రవరి 10 నుంచి అందుబాటులో సైట్‌లో ఉంచనుంది. 


అన్ని కేటగిరీ అభ్యర్థులు రూ. 385 ఫీజు చెల్లించాలి. డెబిట్ కార్డు ద్వారా గానీ... క్రెడిట్ కార్డు ద్వారాగానీ, నెట్‌బ్యాంకింగ్ ద్వారా గానీ చెల్లించవచ్చు. 


అప్లై చేయాలనుకునే వారికి వయోపరిమితి కూడా విధించారు. ఎలాంటి అనుభవం లేని వ్యక్తుల వయసు 40 ఏల్లు దాటకూడదు. అంటే టీజీటీ, పీఆర్టీ అప్లై చేయాలనుకునే వాళ్లు 29 ఏళ్లకు మించి ఉండకూడదు. పీజీటీ అప్లై చేయాలనుకునే వారి వయసు 36ఏళ్లకు మించి ఉండకూడదు. ఉపాధ్యాయ వృత్తిలో అనుభవం ఉన్నవారు 57ఏళ్లు ఉన్న వ్యక్తులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఓబీసీ, ఎస్సీఎస్టీ, ఎక్స్‌ సర్వీస్‌ పీపుల్‌కు సడలింపు ఉంటుంది. 


మొత్తం ఎనిమిదివేల ఏడు వందల ఖాళీలు ఉన్నాయి. ఇండియాలో ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుంది. పీజీటీకి అప్లై చేయాలనుకునే వాళ్లు  సంబంధిత సబ్జెక్ట్‌లో 50 శాతం మార్కులతో పీజీ, బీఈడీ కంప్లీట్ చేసి ఉండాలి. టీజీటీ పోస్టులకు అప్లై చేయాలనుకునే వాళ్లు యాభై శాతం మార్కులతో డిగ్రీ, బీఈడీ కంప్లీట్ చేసి ఉండాలి. పీఆర్టీకి అప్లై చేయాలనుకుంటే డిగ్రీతోపాటు బీఈడీ కానీ... టీచింగ్‌లో రెండేళ్ల డిప్లమో కానీ చేసి ఉండాలి. 


పూర్తి నోటిఫికేషన్ వివరాల కోసం ఈ పీడీఎఫ్ లింక్ క్లిక్ చేయండి..


Also Read: Hyderabad Jobs: హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో అప్రెంటీస్ పోస్టులు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..


Also Read: MIDHANI Recruitment 2022: హైదరాబాద్ మిధానిలో ఉద్యోగాలు.. లక్షల్లో వేతనం.. అప్లై చేసుకోండిలా..


Also Read: BEL Recruitment: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేయాలో తెలుసా? 


Also Read: DigiLocker: యూనివర్సిటీలకు UGC కీలక ఆదేశాలు.. ఇక ఆ సర్టిఫికెట్లకు చెల్లుబాటు


Also Read: Job Skills: కొత్త ఏడాది.. కొత్త స్కిల్స్ నేర్చుకుంటే పోలా.. ఇక 2022 మీదే అవ్వొచ్చు


Also Read: సినిమా చూసిన టైంలో పైసా ఖర్చు లేకుండా యానిమేషన్ నేర్చుకోండిలా.. కొత్త సంవత్సరంలో కొత్తగా ట్రై చేయండి..