హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హైద‌రాబాద్‌లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదలైంది. ఎలాంటి ప‌రీక్ష లేకుండా.. అక‌డామిక్ మెరిట్‌, రిజర్వేష‌న్ ఆధారంగా ఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఎంపికైన వారికి పోస్టు ఆధారంగా రూ.8,000 నుంచి రూ.9,000 వ‌ర‌కు స్టైఫండ్ ఇస్తారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జ‌న‌వ‌రి 7, 2022 నుంచి జ‌న‌వ‌రి 17, 2022 వ‌ర‌కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.  https://portal.mhrdnats.gov.in/ లో అప్లై చేసుకోవాలి.


టెక్నిషియ‌న్ అప్రెంటీస్ ట్రైనీకి సంబంధించి.. 80 ఖాళీలు ఉన్నాయి. 8 వేల రూపాయల వరకు జీతం ఉంటుంది. ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్‌, ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్, మెకానిక‌ల్‌, సివిల్‌, కంప్యూట‌ర్ సైన్స్‌, ఎయిరోనాటిక‌ల్ ఇంజినీరింగ్ త‌దిత‌ర విభాగాల్లో  ఇంజినీరింగ్ చేసి ఉండాలి. అభ్యర్థులు 2019, 2020, 2021 సంవ‌త్సరాల్లో పాస్ అయి ఉండాలి. 


గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీలో 70 ఖాళీలు ఉన్నాయి. రూ.9 వేల వరకు వేతనం ఉంటుంది. ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్‌, ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్, మెకానిక‌ల్‌, సివిల్‌, కంప్యూట‌ర్ సైన్స్‌, ఎయిరోనాటిక‌ల్ ఇంజ‌ినీరింగ్ త‌దిత‌ర విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి ఇంజినీరింగ్‌ చేసి ఉండాలి. 2019, 2020, 2021 సంవత్సరాల్లో పాస్ అయి ఉండాలి. 


అప్లై చేసుకున్న వారి.. అక‌డ‌మిక్ మెరిట్‌, రిజ‌ర్వేష‌న్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. విద్యార్హతలు డాక్యుమెంట్స్ ప‌రిశీలించి ఎంపిక చేస్తారు. త‌ప్పుడు ధ్రువ‌ప‌త్రాల‌ను స‌మ‌ర్పించిన వారిపై చర్యలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. https://portal.mhrdnats.gov.in/ వెబ్‌సైట్ లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి. ద‌రఖాస్తు చేసుకునేందుకు జ‌న‌వ‌రి 17, 2022 వ‌ర‌కు ఛాన్స్ ఉంది.


Also Read: AP Model School Jobs: మోడల్‌ స్కూళ్లలో 282 టీచర్‌ పోస్టులు.. నోటిఫికేషన్ విడుదల


Also Read: MIDHANI Recruitment 2022: హైదరాబాద్ మిధానిలో ఉద్యోగాలు.. లక్షల్లో వేతనం.. అప్లై చేసుకోండిలా..


Also Read: APPSC Jobs Recruitment: ఏపీపీఎస్సీ నోటిఫికేషన్.. ఉద్యోగాల వివరాలివే.. దరఖాస్తుకు చివరితేదీ ఎప్పుడంటే


Also Read: Job Skills: కొత్త ఏడాది.. కొత్త స్కిల్స్ నేర్చుకుంటే పోలా.. ఇక 2022 మీదే అవ్వొచ్చు


Also Read: ఇలాంటి కోర్సులపై ఓ లుక్కెయండి... ఏమో మీ భవిష్యత్ వీటితోనే ఉందేమో!


Also Read: Vanama Raghava Case: ఆస్తి తగాదాలు.. అక్రమ సంబంధాలు.. రామకృష్ణ మరో సెల్ఫీ వీడియో వైరల్‌


Also Read: కామారెడ్డి జిల్లాలో గుబులు పుట్టిస్తున్న ఒమిక్రాన్ కేసులు


Also Read: నీకు నా మొగుడే కావాలా..? సచివాలయంలో మహిళల కొట్లాట.. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి