కామారెడ్డి జిల్లాలో ఒమిక్రాన్ కేసులతో భయం మెుదలైంది. ఇప్పటికే జిల్లాలో ఇద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చింది. ఇద్దరూ విదేశాల నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. కామారెడ్డి జిల్లాలో ఒమిక్రాన్ కేసులు గుబులు పుట్టిస్తున్నాయ్. జిల్లాలో మరో ఒమిక్రాన్ పాజిటివ్ కేసు నమోదైంది. ఇప్పటి వరకు 2 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా రాజంపేట మండలం తలమడ్లకు చెందిన 22 ఏళ్ల ఓ యువకుడు ఇటీవలే ఖత్తార్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. అతడికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒమిక్రాన్ గా నిర్దారణ అయింది. 5 రోజుల క్రితం కరోనా పాజిటివ్ గా తేలడంతో.. జినోమ్ పరీక్షకు పంపగా ఒమిక్రాన్ పాజిటివ్ గా రిపోర్ట్స్ వచ్చాయి.
సదరు యువకుడిని హుటాహుటిన స్పెషల్ ఆంబులెన్స్ లో టిమ్స్ కు తరలించారు. సదరు యువకుడి ప్రైమరీ కాంటాక్ట్స్ అయిన ఏడుగురిని గుర్తించి పరీక్షలు చేయగా.. వారికి నెగటివ్ గా తేలటంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు. ఇప్పటికే అమెరికా నుంచి వచ్చిన ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన మరో వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ కాగా.. ఇది జిల్లాలో రెండో కేసు కావడంతో ఆందోళన నెలకొంది. మరోవైపు మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో కూడా.. ఓ ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్ గా తేలడంతో.. మిగిలిన ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.
ఆరోగ్య, ఫ్రంట్ లైన్ కార్మికులతోపాటు 60 ఏళ్ల పైబడిన వారికి జనవరి 10 నుంచి ముందస్తు జాగ్రత్త.. టీకాలు వేయనున్నారు. ఇప్పటికే రెండు డోస్‌ల కోవిడ్-19 వ్యాక్సిన్‌ను పొంది, బూస్టర్ డోస్‌కు అర్హులైన వారు కొత్త రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది.
'కొవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నవారు ప్రికాషన్ డోసుకు అర్హులైనవారు.. ఈ డోసు కోసం మళ్లీ కొవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి. ప్రికాషనరీ డోసు టీకా షెడ్యూల్స్‌ను జనవరి 8న తెరుస్తాం. శనివారం సాయంత్రం నుంచి ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ సదుపాయం ఉంటుంది. జనవరి 10 నుంచి నేరుగా టీకా కేంద్రానికి వెళ్లి కూడా టీకా కోసం అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు.' ఆరోగ్య శాఖ తెలిపింది.
Also Read: Harish Rao: మధ్యప్రదేశ్ సీఎం మాటలు చూస్తుంటే.. వంద ఎలుకలు తిన్న పిల్లి శాకహారి అన్నట్లు ఉంది
Also Read: KCR CPM : కమ్యూనిస్టు పార్టీలతో కేసీఆర్ కీలక చర్చలు.. ప్రగతి భవన్‌లో విజయన్, ఏచూరీలతో విందు భేటీ !