నేచురల్ స్టార్ నాని హీరోగా సాయపల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించిన శ్యామ్ సింగరాయ్ క్రిస్మస్ సందర్భంగా డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకి వచ్చింది.  రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించిన  ఈ మూవీ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో థియేటర్లలో సందడి చేసిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్.. ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు సిద్ధమవుతోంది. శ్యామ్ సింగరాయ్' సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ భారీగానే వెచ్చించి కొనుగోలు చేసిందట. జనవరి 21నుంచి ఓటీటీలో సందడి చేయబోతోంది ఈ సినిమా.  


Also Read: బికినీలో బాలయ్య హీరోయిన్.. మరీ ఇంత పొదుపా?!
సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అయిన ఆరు వారాలకు డిజిటల్ వేదికల మీదకు వస్తుంటాయి. కానీ ఇప్పుడు 'పుష్ప' లాంటి పెద్ద సినిమాను నాలుగు వారాలైనా దాటకముందే ఓటీటీలో స్ట్రీమింగ్ చేశారు. ఇదే కోవలో  ''శ్యామ్ సింగరాయ్''  కూడా నెలరోజులు  తిరగక ముందే డిజిటల్ స్క్రీన్ మీదకు రాబోతోంది. నెట్ ఫ్లిక్స్ లో తెలుగుతో పాటుగా మిగతా దక్షిణాది భాషల్లో ఈ సినిమాని ప్రేక్షకులకు అందుబాటులో ఉంచనున్నారట.  



Also Read: ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన ఆర్టీసీ డ్రైవర్ కొడుకు..
అసలు విషయం ఏంటంటే జనవరి 21న హాట్ స్టార్ ఓటీటీలో 'అఖండ' సినిమా ప్రీమియర్ గా రానుంది. అంటే అదే రోజు దీనికి పోటీగా  'శ్యామ్ సింగరాయ్' సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే  'వి' 'టక్ జగదీష్'  చిత్రాలను డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేసిన నాని.. ఈసారి ఎలాగైనా థియేట్రికల్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే థియేటర్లలో తీసుకొచ్చి నాలుగు వారాల్లోనే ఓటీటీలో వదలబోతున్నారు. అదే రోజు అఖండ ఓటీటీ విడుదల ఉండడంతో మొన్నటి వరకూ వెండితెరపై ఉన్న పోటీ ఇప్పుడు ఓటీటీలో జోరందుకుంటోందంటున్నారంతా.  మరి థియేటర్లలో పాజిటివ్ టాక్ సంపాదించుకున్న అఖండ, శ్యామ్ సింగరాయ్ రెండు సినిమాల్లో ఓటీటీలో ఎక్కువ మార్కులు కొట్టేసేది ఏదో వెయిట్ అండ్ సీ... 



Also Read:  రానా... వెంకటేష్ బట్టలు ఇప్పేశావ్ నువ్వు!
Also Read: మ‌గాళ్ల‌కు మంచి టిప్‌... అదీ పెళ్లి త‌ర్వాత భార్య‌తో బాల‌కృష్ణ చేసుకున్న‌ అగ్రిమెంట్!
Also Read: చచ్చిపోతా, మంట పెట్టేస్తారనుకున్నా - రాజ‌శేఖ‌ర్‌ భావోద్వేగం... జీవిత కన్నీరు
Also Read: డేంజర్ ముందుంది... ఆ డేంజర్ పేరు రాకీ భాయ్... వేసవిలో!
Also Read: 'చచ్చిపో.. నీకు నరకంలో కూడా చోటుండదు..' కోవిడ్‌తో బాధపడుతున్న హీరోయిన్‌కు శాపనార్థాలు..
Also Read: నా మైండ్ పని చేయలేదు.. గుర్తుపట్టలేనంతగా మారిపోయా.. స్టార్ హీరోయిన్ కామెంట్స్..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.