విక్టరీ వెంకటేష్ త్వరలో డిజిటల్ తెర మీదకు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆయన హీరోగా నటించిన 'నారప్ప', 'దృశ్యం 2' సినిమాలు ఓటీటీ వేదికలో విడుదల అయ్యాయి. అయితే... అవి థియేటర్ల కోసం తీసినవి. కానీ, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ కోసం అబ్బాయి రానాతో కలిసి 'రానా నాయుడు' అని వెంకటేష్ ఓ వెబ్ సిరీస్ తీస్తున్నారు. అందులో బూతులు ఉన్నాయట. నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్ స్టాపబుల్' టాక్ షోలో రానా ఈ విషయం వెల్లడించారు. వెంకటేష్‌కు ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఉంది. దాన్నుంచి బయటకు వచ్చి ఈ సిరీస్ చేస్తున్నట్టు ఉన్నారు.
'నువ్వు, మీ బాబాయ్ (వెంకటేష్) కలిసి ఓ షో చేస్తున్నారట కదా... ఓటీటీలో! మొత్తం బూతుల పండగా?' అని బాలకృష్ణ అడిగారు.
'బాగా సార్!' అని రానా చెబితే... వెంటనే 'అమ్మ బాబోయ్!' అంటూ బాలకృష్ణ ఓ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. 'హిందీలో తీస్తున్నారట కదా!' అని అడిగారు.
'ఆయన బూతులు చెప్పడానికి కొంచెం కంగారు పడుతున్నారు. వెంకటేష్ గారితో తెలుగులో చెప్పించడం ఎందుకు? హిందీలో బూతులు చెప్పించడం బెటర్ అనుకున్నాం' అని రానా చెప్పారు.
'సినిమా ఇండస్ట్రీకి స్వామి వివేకానంద మీ బాబాయ్! బట్టలు ఇప్పేశావ్ నువ్వు' అంటూ రానాను బాలకృష్ణ ఆట పట్టించారు.
'లక్కీగా ఆయన అమెరికాలో ఉన్నారు. ఈ షో టెలికాస్ట్ అయ్యే సమయానికి ఆయన చూడకుండా చూస్తాను' అని రానా అంటే... 'నేను వాట్సాప్ లింక్ పంపిస్తాను' అని బాలకృష్ణ చమత్కరించారు.
Also Read: మగాళ్లకు మంచి టిప్... అదీ పెళ్లి తర్వాత భార్యతో బాలకృష్ణ చేసుకున్న అగ్రిమెంట్!
బాలకృష్ణ, రానా ఎపిసోడ్ చాలా సరదాగా సాగింది. నవ్వులు విరిశాయి. ఇక, 'రానా నాయుడు' వెబ్ సిరీస్‌కు వస్తే... అమెరికన్ క్రైమ్ డ్రామా 'రే డొనోవన్'కు ఇండియన్ అడాప్షన్. భారతీయ నేటివిటీ, ఇక్కడి ప్రేక్షకులో అభిరుచికి తగ్గట్టు కొన్ని మార్పులు, చేర్పులు చేశారట.
Also Read: డేంజర్ ముందుంది... ఆ డేంజర్ పేరు రాకీ భాయ్... వేసవిలో!
Also Read: 'చచ్చిపో.. నీకు నరకంలో కూడా చోటుండదు..' కోవిడ్‌తో బాధపడుతున్న హీరోయిన్‌కు శాపనార్థాలు..
Also Read: నా మైండ్ పని చేయలేదు.. గుర్తుపట్టలేనంతగా మారిపోయా.. స్టార్ హీరోయిన్ కామెంట్స్..
Also Read: సౌత్ ఇండియాలో మరో స్టార్ హీరోయిన్‌కు కరోనా... న్యూ ఇయర్ కంటే ముందే!
Also Read: తరుణ్ ఎందుకు సినిమాలు మానేశాడు?
Also Read: చచ్చిపోతా, మంట పెట్టేస్తారనుకున్నా - రాజశేఖర్ భావోద్వేగం... జీవిత కన్నీరు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.